నిఖిల్ పెళ్లి ఆగిపోయింది

First Published Aug 30, 2017, 2:00 PM IST
Highlights
  • సమీప బంధువు ప్రముఖ వ్యాపారవేత్త ఆంజనేయులు యాదవ్ కుమార్తె తేజశ్వినితో నిశ్చితార్థం కూడా జరిగింది.
  • అక్టోబర్ 1వ తేదీన వివాహం జరిపించాలని ఇరు కుటుంబాలు నిశ్చయించారు కూడా.
  • కానీ.. ఆ పెళ్లి ఇప్పుడు ఆగిపోయింది.

 

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. వరస విజయాలతో దూసుకువెళుతున్నాడు.  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ హ్యాపీడేస్’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నిఖిల్.. తర్వాత ఆశించిన విజయాలు అందుకోలేకపోయాడు. కానీ.. ‘ స్వామి రారా’ చిత్రంతో తిరిగి పుంజుకున్నాడు.‘ కార్తికేయ’, సూర్య వర్సెస్ సూర్య, కేశవ సినిమాలతో వరస విజయాలను అదుకున్నాడు.

కాగా.. ఇటీవల నిఖిల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడంటూ వార్తలు వెలువడ్డాయి. సమీప బంధువు ప్రముఖ వ్యాపారవేత్త ఆంజనేయులు యాదవ్ కుమార్తె తేజశ్వినితో నిశ్చితార్థం కూడా జరిగింది. అక్టోబర్ 1వ తేదీన వివాహం జరిపించాలని ఇరు కుటుంబాలు నిశ్చయించారు కూడా. కానీ.. ఆ పెళ్లి ఇప్పుడు ఆగిపోయింది.

నిఖిల్, తేజశ్విని జాతకాలు కలవకపోవడమే ఇందుకు కారణమని నిఖిల్ సన్నిహితులు చెబుతున్నారు. కారణం ఏదైనా కానీ నిఖిల్ పెళ్లి ఆగిపోవడం మాత్రం నిజం.

ప్రస్తుతం నిఖిల్ కన్నడ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన కిరిక్ పార్టీ రిమేక్ లో నటిస్తున్నారు. దీనికి కొత్త డైరెక్టర్ శరణ్ కొప్పి శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నిఖిల్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నారు.

click me!