`తంగలాన్` చిత్రంతో అలరించిన ` దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా టైటిల్ విడుదలైంది. ఇందులో కాస్టింగ్ వివరాలు ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి.
`అట్టకత్తి` సినిమాతో దర్శకుడిగా పరిచయమైన టాలెంటెడ్ డైరెక్టర్ పా. రంజిత్. ఆయన తొలి సినిమాలో దినేష్, నందిత శ్వేత, ఐశ్వర్య, కలైయరసన్, యోగి బాబు వంటి నటులు నటించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంశలు అందుకుంది. ఆ తర్వాత కార్తి, కలైయరసన్, రితికా, కేథరిన్ థెరిస్సా నటించిన `మద్రాస్` సినిమాను తెరకెక్కించారు. పూర్తిగా రాజకీయ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా పా. రంజిత్ ని కెరీర్ పరంగా మరో మెట్టు ఎక్కించింది.
ఆ తర్వాత ఏకంగా రజనీకాంత్‌తో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నారు. సూపర్ స్టార్‌తో వరుసగా `కబాలి`, `కాలా` సినిమాలు తీశారు. ఈ సినిమాలు మంచి ఆదరణ పొందాయి. అణగారి వర్గాల స్ట్రగుల్స్ ఆవిష్కరించిన ఈ చిత్రాలు విమర్శకుల ప్రశంసలందుకున్నాయి. కమర్షియల్‌గా జస్ట్ ఓకే అనిపించాయి. తర్వాత `సార్పట్టా పరంబరై`, `నక్షత్రం నగర్‌కిరాతు`, ఇటీవల విక్రమ్‌తో `తంగలాన్` వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. భారీ అంచనాలతో వచ్చిన `తంగలాన్` డిజప్పాయింట్ చేసింది. ఇప్పుడు ఆయన కొత్త సినిమా గురించి అప్‌డేట్ ఇచ్చారు. దినేష్, ఆర్య, అశోక్ సెల్వన్ నటిస్తున్న ఈ సినిమాకు `వెట్టువం` అనే టైటిల్ ఖరారు చేశారు
ఈ సినిమాలో ఆర్య విలన్‌గా, దినేష్ హీరోగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాతో పా. రంజిత్, దినేష్ కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా. ఇంతకు ముందు `అట్టకథి`, `కబాలి` సినిమాల్లో దినేష్ నటించారు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్లు సమాచారం.దినేష్ నటించిన `లప్పర్ బంతి` సినిమా గత సెప్టెంబర్‌లో విడుదలైంది. సింపుల్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో అట్టకథి దినేష్‌తో పాటు హరిష్ కల్యాణ్, స్వాతిక, కాలి వెంకట్, సంజన కృష్ణమూర్తి, బాలా సరవణన్ వంటి నటులు నటించారు.
క్రికెట్, ప్రేమ, సెంటిమెంట్, కుటుంబ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంశలు, మంచి వసూళ్లు సాధించింది. ఈ సినిమా దినేష్ కెరీర్‌కు మరో మెట్టు. ఈ సినిమా తర్వాత `దండకారణ్యం` సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత పా. రంజిత్ దర్శకత్వంలో మూడో సినిమాలో నటిస్తున్నారు.
ఇక ఆర్య కూడా సినిమాల్లో రాణించడానికి చాలా కష్టపడ్డారు. `నాన్ కడవుల్`, `మద్రాస్‌పట్టిణం`, `రాజా రాణి`వంటి సినిమాలు ఆర్య కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచాయి. ప్రస్తుతం `మిస్టర్ ఎక్స్` అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పుడు పా. రంజిత్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా 2025లో విడుదల కానుంది.
ఇటీవల అశోక్ సెల్వన్ నటించిన `ఎమక్కు తొజిల్ రొమాన్స్` సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత `థగ్ లైఫ్` సినిమాలో నటిస్తున్నారు. దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న `థగ్ లైఫ్ సినిమాలో కమల్ హాసన్, సింబు, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి, అభిరామి, నాజర్, శేఖర్, వడివుక్కరసి వంటి నటులు నటిస్తున్నారు. ఈ సినిమా 2025 జూన్ 5న విడుదల కానుంది.
read more: ఐశ్వర్యా రాయ్ వల్లే సల్మాన్ ఖాన్ జీవితాన్ని నాశనం అయ్యిందా ? సోహైల్ ఖాన్ చెప్పిన నిజాలేంటి?
also read: రామ్ చరణ్‌లో ఉన్న పెద్ద బలహీనత బయటపెట్టిన ఎన్టీఆర్.. ర్యాగింగ్ వేరే లెవల్