బాలీవుడ్ మూవీతో స్టార్ డైరెక్టర్ గా మారిన అట్లీకి.. అదే బాలీవుడ్ మూవీ షాక్ ఇచ్చేలా కనిపిస్తుంది..?
ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు అట్లీ. ఆయన తమిల, తెలుగు భాషల్లో చివరిగా బిగిల్ సినిమా తీశారు. విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా 2019లో విడుదలైంది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌కి వెళ్లిన అట్లీ అక్కడే సెటిల్ అయిపోయారు. షారుఖ్ ఖాన్ హీరోగా ఆయన తీసిన జవాన్ సినిమా బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసింది.
జవాన్ సినిమా సక్సెస్ తర్వాత అట్లీ డేట్స్ కోసం బాలీవుడ్ హీరోలు క్యూ కడుతున్నారు. దాంతో ఆయన ఇప్పుడు టాలీవుడ్ వైపు చూసే ఐడియాలో లేరు. బాలీవుడ్‌లో డైరెక్టర్‌గా సక్సెస్ అయిన అట్లీ, ఇప్పుడు అక్కడే నిర్మాతగా కూడా ఎంట్రీ ఇచ్చారు. క్రిస్మస్‌కి విడుదలైన బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్‌లో నిర్మాతగా అరంగేట్రం చేశారు. ఇది ఆయన తమిళంలో తీసిన తెరి సినిమాకి రీమేక్.
బేబీ జాన్ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటించారు. ఆయనకి జోడీగా కీర్తి సురేష్ నటించింది. ఈ సినిమాతో కీర్తి బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా అతిథి పాత్రలో నటించారు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 25న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది.
కానీ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దాంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాదాపు 160 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను భారీగా నిర్మించారు. కానీ విడుదలైన నాలుగు రోజుల్లో ఈ సినిమా కేవలం 23.90 కోట్ల రూపాయలను మాత్రమే వసూలు చేసింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ సినిమా 60 కోట్ల రూపాయలను మాత్రమే వసూలు చేస్తుందని అంచనా. దాంతో ఈ సినిమా ద్వారా నిర్మాతలకు 100 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చే అవకాశం ఉందని సమాచారం.