
కొన్నాళ్ళుగా రామ్ గోపాల్ వర్మ పొలిటికల్ విషయాలపై స్పందిస్తున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ లను ఆయన ఏకిపారేస్తుంటారు. వీలు దొరికితే చాలు సెటైర్స్ తో రెచ్చిపోతుంటారు. పవర్ స్టార్ మూవీలో పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్ ని ఓ రేంజ్ లో రామ్ గోపాల్ వర్మ ట్రోల్ చేశాడు. ఇక ఏపీ రాజకీయాల్లో వర్మ సీఎం జగన్ కి సానుభూతిపరుడు. ఆయన పట్ల ప్రత్యేక అభిమానం చూపిస్తారు. టికెట్స్ ధరల తగ్గింపు విషయంలో మాత్రం జగన్ కి వ్యతిరేకంగా వర్మ మాట్లాడాడు. వరుస ట్వీట్స్ తో టార్గెట్ చేశాడు.
తాజాగా వ్యూహం టైటిల్ తో జగన్ బయోపిక్ తెరకెక్కిస్తున్నాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం ఏర్పడిన పరిస్థితులు తెరకెక్కించనున్నారట. కాగా నారా లోకేష్ పాదయాత్రను ఉద్దేశిస్తూ వర్మ సెటైరికల్ ట్వీట్స్ వేశారు. రాయలసీమలో నారా లోకేష్ పాదయాత్ర ముగిసింది. ఈ సందర్భంగా రాయలసీమ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ నేలను ముద్దాడాడు. వర్మ దీన్ని ఓవర్ యాక్షన్ గా అభివర్ణించాడు.
రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఆస్కార్ కి అర్హులు కారు. అసలు ఆస్కార్ ఇవ్వాల్సింది ఆయనకు అంటూ లోకేష్ ఉద్దేశించి సెటైర్ వేశాడు. ఆస్కార్ రేంజ్ లో నారా లోకేష్ నటిస్తున్నాడని పరోక్షంగా చెప్పాడు. వర్మ ట్వీట్ వైరల్ అవుతుంది. ఇక ఎప్పటిలాగే టీడీపీ వర్గాలు వర్మ మీద విరుచుకుపడుతున్నారు. ఆయన్ని తిట్టిపోస్తున్నారు.
వర్మ ఇటీవల కొత్త ఆఫీస్ తెరిచాడు. ఆర్జీవీ డెన్ పేరుతో విన్నూత్నంగా ఆ ఆఫీస్ రూపొందించారు. తన చిత్రాలు, వర్కింగ్ స్టిల్స్, ప్రముఖులతో దిగిన ఫోటోలతో ఆఫీస్ నింపేశాడు. నగ్న, అర్థనగ్న ఫోటోలు కూడా కొత్త ఆఫీస్ గోడలకు తగిలించి ఉన్నాయి. వర్మ తన టేస్ట్ కి తగ్గట్లుగా ఆఫీస్ రూపొందించారు.