చిరుది మామూలు స్కెచ్ కాదు 'బ్రో' ,అందుకే ఆయన మెగాస్టార్

Published : Jun 15, 2023, 09:10 AM IST
 చిరుది మామూలు స్కెచ్ కాదు 'బ్రో' ,అందుకే ఆయన మెగాస్టార్

సారాంశం

చిరుకు ఉన్న అనుభవం ఆయన ఎంచుకునే ప్రాజెక్టుల మీద ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఒక్కోసారి లెక్క తప్పచ్చేమో కానీ ఎక్కువసార్లు వాల్తేరు వీరయ్యలాంటి మ్యాజిక్ లే జరుగుతాయి.


ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య తో సూపర్ హిట్ ఇచ్చారు చిరంజీవి. రవితేజ, చిరంజీవి కాంబినేషన్ థియేటర్స్ ని ఊపేసింది. అలా మరోసారి తన మ్యాజిక్ ని రిపీట్ చేయటానికి రంగం సిద్దం చేస్తున్నారు చిరు. ఈ సారి సిద్దు జొన్నలగడ్డతో కలిసి సంక్రాంతికి థియేటర్స్ లో దిగనున్నారు. వివరాల్లోకి వెళితే...

చిరంజీవి – క‌ల్యాణ్ కృష్ణ కాంబినేష‌న్‌లో ఓ కొత్త చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసందే.  ఇందులో చిరు త‌న‌యుడిగా సిద్దు న‌టిస్తున్నాడు. సిద్దుకి జోడీగా శ్రీ‌లీల‌ని ఎంచుకొన్నారు.   ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ స్క్రిప్టును సమకూర్చుతుండగా.. చిరంజీవి కూతురు సుష్మిత నిర్మిస్తోంది.  ఈ సినిమా మలయాళీ సినిమా బ్రోడాడీకి రీమేక్ అని లేటెస్ట్ టాక్. దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. మలయాళం బ్రో డాడీ’ (Bro Daddy) లో మోహన్‌ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోలుగా నటించారు.

మలయాళం లో బ్రో డాడీ అనే సినిమా రిలీజ్ ఆప్ సూపర్ హిట్ గా నిలిచింది. మోహన్ లాల్ తండ్రి పాత్రలో నటించగా పృథ్వీరాజ్ సుకుమారన్ కొడుకు పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారున్ సరసన కళ్యాణి ప్రియదర్శన్ నటించగా మోహన్ లాల్ సరసన మీనా నటించింది. ఈ క్రమంలో దీన్ని తెలుగు నేటివిటీ ఉన్న సినిమాగా మలిచేందుకు ప్రయత్నాలు చేసారని సమాచారం.  మెగాస్టార్ చిరంజీవి సరసన కూడా ఒక సీనియర్ హీరోయిన్ ని ఎంపిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 

ఈ నేపథ్యంలో ఈ తెలుగు బ్రో డాడీ కోసం ఎలాంటి హంగులు చేర్చబోతున్నారు అనే అంశం హాట్ టాపిక్ గా మారుతుంది. మరి ప్రేక్షకులను ఏ మేరకు దర్శకుడు మెప్పించబోతున్నాడు అనేది చూడాల్సి ఉంది.  

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?