చిరంజీవి, బాలయ్య మధ్య మరోసారి బిగ్‌ ఫైట్‌.. ఈ సారి అరుదైన సంఘటన.. 90 కిడ్స్ కి పండగే

By Aithagoni Raju  |  First Published Aug 21, 2024, 3:04 AM IST

బాక్సాఫీసు వద్ద మరోసారి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం పోటీ పడబోతున్నారు. వచ్చేసంక్రాంతికి బిగ్‌ ఫైట్‌ నెలకొనబోతుంది. కానీ మరో సర్‌ప్రైజ్‌ కూడా ఉంది.
 


బాక్సాఫీసు వద్ద పెద్ద హీరోల మధ్య పోటీ యమ రంజుగా ఉంటుంది. ఇటీవల కాలంలో సంక్రాంతికి ఈ రంజుకనిపిస్తుంటుంది. అయితే చాలా ఏళ్లుగా సంక్రాంతికి నాలుగైదు సినిమాలువస్తున్నాయి. బాగున్నా సినిమా మాత్రమే ఆడుతుంది. మిగిలిన మూవీస్‌ పెద్దగా ఇంపాక్ట్ చూపించడం లేదు. యావరేజ్‌గా ఉన్న సినిమాలు కూడా అంతో ఇంతో మంచి కలెక్షన్లని సాధిస్తున్నాయి. అయితే వచ్చే సంక్రాంతి ఎక్కువ సినిమాల పోటీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇందులో బాలయ్య, చిరు రాబోతుండం విశేషం. 

అవును మరోసారి మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి నటసింహం బాలయ్య బాక్సాఫీసు వద్ద పోటీపడుతున్నారు. నువ్వా నేనా అని తేల్చుకోబోతున్నారు. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా నడుస్తుందంటే, దాన్ని మించి మరో విషయం చక్కర్లు కొడుతుంది. ఈ సంక్రాంతికి మరో ప్రత్యకత చోటు చేసుకోబోతుంది. 90 కిడ్స్ పండగ చేసుకునే సందర్భం రాబోతుంది.   

Latest Videos

చిరంజీవి `విశ్వంభర` సంక్రాంతికి రాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. వశిష్ట దర్శకత్వం వహించిన `విశ్వంభర` మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటుంది. సోషియో ఫాంటసీ మూవీ కావడంతో సీజీ వర్క్ బాగానే ఉంది. పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ కి కాస్త టైమ్‌ పడుతుంది. మొత్తంగా సంక్రాంతికి రావడం మాత్రం పక్క. సంక్రాంతికి చిరుకి బాగాకలిసి వచ్చింది. గతంలో చాలాసార్లు సంక్రాంతికి వచ్చి హిట్‌ కొట్టాడు. రీఎంట్రీ మూవీ `ఖైదీ నెంబర్‌ 150`, `వాల్తేర్‌ వీరయ్య`తో ఆయన కెరీర్‌ బెస్ట్ హిట్స్ అందుకున్నాడు.  ఇప్పుడు `విశ్వంభర`తో రచ్చ చేసేందుకు రాబోతున్నాడు.

ఈ సంక్రాంతికి బాలయ్య కూడా రాబోతున్నాడట. ఆయన ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో `ఎన్బీకే109` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ దసరా, దీపావళి, క్రిస్మస్‌కి వస్తుందనే ప్రచారం జరిగింది. కానీ ఎలాంటి అప్‌ డేట్ లేదు. షూటింగ్‌ ఎంత వరకు అయ్యిందనేది క్లారిటీ లేదు. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా కూడా సంక్రాంతికి రాబోతుందట. ఈ విషయం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

ఇదిలా ఉంటే వచ్చే సంక్రాంతికి మరోసారి చిరంజీవి, బాలయ్య పోటీ పడబోతున్నారు. బాక్సాఫీసు వద్ద ఫైట్‌ కి రెడీ అవుతున్నారని తెలుస్తుంది. గతంలో మాదిరిగానే ఈ ఇద్దరు థియేటర్లలో రచ్చ చేయబోతున్నారట. అయితే సంక్రాంతికి చిరు, బాలయ్య అనేది యమ రంజుగా సాగే పోటీ. అభిమానుల కోలాహలం, పోటీ వాతావరణం మరో స్థాయిలో ఉంటుంది. ఎంత మంది పెద్ద హీరోల సినిమాలు పోటీ పడ్డా, చిరు, బాలయ్య పోటీ పడితే వచ్చే కిక్‌ వేరే ఎప్పుడూ రాదు, నిజమైన సినిమా పండగలా ఉంటుంది. పోటీ కూడా ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది.నువ్వా నేనా అనేలా ఉంటుంది. గత నలభై ఏళ్లుగా ఎన్నోసార్లు ఈ ఇద్దరు సంక్రాంతి బరిలో నిలిచారు. కొన్నిసార్లు చిరు, మరికొన్నిసార్లు బాలయ్య హిట్‌ కొట్టారు. ఇంకొన్ని సార్లు ఇద్దరూ హిట్‌ కొట్టారు. ఇటీవల `ఖైదీ నెంబర్‌ 150`తో బాలయ్య `గౌతమిపుత్రశాతకర్ణి` పోటీ పడింది. అలాగే `వాల్తేర్‌ వీరయ్య`తో `వీరసింహారెడ్డి` పోటీ పడింది. రెండూ విజయాలు సాధించాయి. కానీ కలెక్షన్లలో చిరంజీవి సినిమా కాస్త బెటర్‌గా ఉండటం విశేషం. మరి ఈ సారి ఎలా ఉంటుందో చూడాలి. 

ఈ సారి మరో ప్రత్యేకత నెలకొంది. వచ్చే సంక్రాంతికి సీనియర్లంతా దిగుతున్నారు. నాగార్జున, వెంకటేష్‌ కూడా పోటీలో ఉన్నారు. అనిల్‌ రావిపూడితో చేసేసినిమాతో వెంకటేష్‌ సంక్రాంతి బరిలోనే ఉన్నాడు. అలాగే నాగార్జున సైతం సంక్రాంతికి వస్తానని తెలిపాడు. ఆయన ఇంకా సినిమాని ప్రకటించలేదు. కానీ `నా సామిరంగ` దర్శకుడితోనే మరో సినిమా చేస్తున్నాడని సమాచారం. ఇలా చిరు, బాలయ్య, నాగ్‌, వెంకీ ఒకేసారి, అది కూడా సంక్రాంతికి వస్తే ఆ మజా వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. 90కిడ్స్ కిది అసలైన సినిమా పండగ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

click me!