సుకుమార్‌ భార్యకి అల్లు అర్జున్‌ సాయం.. రావు రమేష్‌కి ఈ రేంజ్‌ ఎలివేషన్‌ ఊహించలేం..

సుకుమార్‌ భార్య తబిత నిర్మాతగా మారింది. ఆమె కోసం అల్లు అర్జున్‌ తనవంతు సాయం చేయడానికి వస్తున్నాడు. రావు రమేష్‌కి భారీ ఎలివేషన్‌ దక్కబోతుంది. 
 


సుకుమార్‌ దర్శకత్వంతోపాటు ప్రొడక్షన్‌ కూడా చేస్తున్నాడు. సుకుమార్‌ రైటింగ్స్ పేరుతో ఆయన కంటెంట్‌ ఉన్న చిత్రాలను నిర్మిస్తున్నారు. తన శిష్యులకు అవకాశాలిస్తూ వారిని ఎంకరేజ్‌ చేస్తున్నారు. సుకుమార్‌ రైటింగ్స్ కాదని ఆయన భార్య తబిత సుకుమార్‌ ప్రొడక్షన్‌ లోకి దిగింది. పీబీఆర్‌ సినిమాస్‌, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై రూపొందిన `మారుతీనగర్‌ సుబ్రమణ్యం` చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తుంది. సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లే బాధ్యతలు తీసుకుంది. సుకుమార్‌ రైటింగ్స్ లోనే ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకున్నా, సుకుమార్‌ స్పందించకపోవడంతో తనే నిర్మాతగా మారింది తబితా. ఇలాంటి సినిమాలకు తన అవసరం ఉందని భావించిన ఆమె ఈ మూవీని ఎంకరేజ్‌ చేసే ఉద్దేశ్యంతో ఆమె నిర్మాతగా మారినట్టు తెలిపింది. 

రావురమేష్‌, ఇంద్రజ, అంకిత్‌ కొయ్య,రమ్య పసుపులేని జంటలుగా నటించిన ఈ చిత్రానికి లక్ష్మణ్‌ కార్య దర్శకత్వం వహించారు. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 23న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచారు. అందులో భాగంగా గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ప్లాన్‌ చేశారు. దీనికి అల్లు అర్జున్‌ గెస్ట్ గా వస్తుండం విశేషం. సుకుమార్‌ భార్య కోసం ఐకాన స్టార్‌ రంగంలోకి దిగారు. సినిమాని తనవంతుగా ప్రమోట్‌ చేయబోతున్నారు. బన్నీ గెస్ట్ గా అంటే రావు రమేష్‌కి భారీ స్థాయిలోఎలివేషన్‌ దక్కుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Latest Videos

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ఆగస్టు 21న హైదరాబాద్‌లో 'మారుతి నగర్ సుబ్రమణ్యం' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇప్పటికే 'మారుతి నగర్ సుబ్రమణ్యం'ను సుకుమార్, తబిత దంపతులు చూశారు. వినోదంతో పాటు చక్కటి కుటుంబ విలువలతో తెరకెక్కిన ఈ సినిమా విపరీతంగా నచ్చడంతో తన సమర్పణలో విడుదల చేయడానికి తబిత ముందుకు వచ్చారు. 'మారుతి నగర్ సుబ్రమణ్యం'లో రావు రమేష్, అంకిత్ కొయ్య తండ్రి కుమారుల పాత్రలు చేశారు. రావు రమేష్ తన తండ్రి కాదని, తాను అల్లు కుటుంబంలో పుట్టానని, అల్లు అరవింద్ తన తండ్రి - అల్లు అర్జున్ తన అన్నయ్య అనుకునే క్యారెక్టర్ చేశారు అంకిత్ కొయ్య. ప్రేమించిన అమ్మాయిని ఊహించుకుంటూ పాడుకునే పాటల్లోనూ అల్లు అర్జున్ సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ రీ క్రియేషన్ చేశారు.  

రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సాహిత్యం: ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్, భాస్కరభట్ల, కళ్యాణ్ చక్రవర్తి, ఆర్ట్ డైరెక్షన్: సురేష్ భీమంగని, ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి, పీఆర్వో: పులగం చిన్నారాయణ, సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాల్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: శ్రీహరి ఉదయగిరి, క్రియేటివ్‌ హెడ్‌: గోపాల్‌ అడుసుమల్లి, సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల, నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: లక్ష్మణ్ కార్య.

click me!