ట్రెండింగ్ లో బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర... మేకర్స్ లో వణుకు.. కాపాడేది ఆ ఒక్కటే!

Published : Aug 30, 2022, 05:13 PM IST
ట్రెండింగ్ లో బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర... మేకర్స్ లో వణుకు.. కాపాడేది ఆ ఒక్కటే!

సారాంశం

మరో భారీ బడ్జెట్ చిత్రాన్ని కబళించేందుకు నెటిజెన్స్ సిద్ధమయ్యారు. బ్రహ్మాస్త్ర మూవీ సెప్టెంబర్ 9న వరల్డ్ వైడ్ పాన్ ఇండియన్ మూవీగా ఐదు భాషల్లో విడుదల కానుంది. అప్పుడే ఈ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలంటూ ట్విట్టర్ లో హాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. 

బాయ్ కాట్ ట్రెండ్ బాలీవుడ్ ని భయపెడుతుండగా మరో భారీ బడ్జెట్ చిత్రాన్ని ఆ భూతం కబళించడానికి కోరలు చాచింది. బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర అంటూ ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. నెలల వ్యవధిలో అరడజను చిత్రాలు బాయ్ కాట్ ట్రెండ్ కి బలయ్యాయి. లాల్ సింగ్ చడ్డా. లైగర్ పరిస్థితి మరింత దారుణం.  అమిర్ ఖాన్ కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ గా లాల్ సింగ్ చడ్డా నిలిచింది. కంటెంట్ పక్కన పెడితే బాయ్ కాట్ ట్రెండ్ ఈ చిత్రాన్ని మింగేసింది. 

లైగర్ పరిస్థితి కూడా అంతే. కరణ్ జోహార్ నిర్మాతగా ఉన్నారని, అనన్య పాండే హీరోయిన్ అని, విజయ్ పొగరు చూపించాడన్న కారణాలతో లైగర్ మూవీ బాయ్ కాట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. డిజాస్టర్ టాక్ కి తోడు బాయ్ కాట్ ట్రెండ్ కారణంగా మూవీ మొత్తంగా మునిగింది. అక్షయ్ కుమార్, తాప్సి తాజా చిత్రాలు బాయ్ కాట్ ట్రెండ్ కి బలైపోయాయి. 

తాజాగా మరో భారీ బడ్జెట్ చిత్రాన్ని కబళించేందుకు నెటిజెన్స్ సిద్ధమయ్యారు. బ్రహ్మాస్త్ర మూవీ సెప్టెంబర్ 9న వరల్డ్ వైడ్ పాన్ ఇండియన్ మూవీగా ఐదు భాషల్లో విడుదల కానుంది. అప్పుడే ఈ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలంటూ ట్విట్టర్ లో హాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ మూవీలో నెటిజెన్స్ తమ ప్రధాన శత్రువులుగా భావించే కరణ్ జోహార్, అలియా భట్, రన్బీర్ కపూర్ ఇలా టీం మొత్తం ఉన్నారు. జస్ట్ వాళ్ళ ప్రమేయం ఉన్న సినిమాలనే పనిగట్టుకొని నాశనం  చేసే ఈ సోషల్ మీడియా జనాలు బ్రహ్మాస్త్రను వదులుతారా?. నిజానికి ఈ మూవీ విడుదల కోసం ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. 

ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో కరణ్ జోహార్ భారీ బడ్జెట్ తో బ్రహ్మాస్త్ర నిర్మించారు. రెండు పార్ట్స్ గా బ్రహ్మాస్త్ర విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. నాగార్జున, అమితాబ్, షారుక్ వంటి స్టార్ క్యాస్ట్ కీలక రోల్స్ చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకుడు. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మినహా బ్రహ్మాస్త్రను ఎవరూ కాపాడలేరు. ఇప్పటికే కరణ్ జోహార్ తో పాటు టీమ్ కి వణుకు మొదలైపోయింది. సుశాంత్ సింగ్ మరణానికి కారణం నెపోటిజం అని భావిస్తున్న నెటిజెన్స్ ఈ విధంగా కక్ష తీర్చుకుంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?