విషాదం.. కారులో ప్రముఖ సింగర్ డెడ్ బాడీ.. అర్ధరాత్రి మిస్సింగ్.. డిటేయిల్స్.!

By team teluguFirst Published Aug 30, 2022, 4:01 PM IST
Highlights

సినీ ఇండస్ట్రీలో మళ్లీ విషాదాలు నెలకొంటున్నాయి.  తాజాగా గుజరాత్ కు చెందిన ప్రముఖ సింగర్ అనుమానాస్పద స్థితితో మృతి చెందింది. కారు వెనుక సీట్లో డెబ్ బాడీ లభించడం ఆందోళనకరంగా మారింది. 
 

మూడు నెలల కింద బెంగాలీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు నెలకొన్నాయి. అప్పట్లో ఒకే నెలలో ముగ్గురు నటీమణులు ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలవరపెడుతోంది. సీరియల్ నటి పల్లవి డే, యాక్ట్రెస్ బిదిషా డి మజుందార్, మరో మోడల్ సరస్వతీ దాస్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే కాస్తా వాతావరణం మెరుగవ్వుతుండటంతో తాజాగా చిత్ర సీమలో మరో విషాదం చోటుచేకుంది. ప్రముఖ సింగర్ అనుమానాస్పందంగా మృతి చెందడం ఆందోళనకు గురి చేస్తోంది. 

వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ గుజరాత్ సింగర్ వైశాలి బల్సారా (Vaishali Balsara) తాజాగా ప్రాణాలు కోల్పోయింది. గుజరాత్ స్టేట్ లోని వల్సాద్ జిల్లాలోని పార్ నది ఒడ్డున  వైశాలి మృతదేహం ఓ కారులో అనుమానాస్పద రీతిలో లభ్యమైంది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసుల వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప్రతికి తరలించారు. ఈ ఘటనపై అన్నీ కోణాల్లో ఆధారాలను సేకరిస్తున్నారు. 

కాగా, వైశాలీకి గతంలో తోటీ సింగర్ హితేశ్ తో వివాహం జరిగింది. ఇద్దరు కలిసి ఎన్నో స్టేజ్ షోల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం గుజరాత్ లోనే వీరు నివసిస్తునన్నారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి వైశాలీ ఇంట్లో కనిపించకపోవడంతో.. అదేరాత్రి 2 గంటలకు పోలీసులకు సమాచారం అందిచారు. దీంతో ఆచూకీ కోసం ప్రయత్నించిన పోలీసులకు పార్ నది ఒడ్డున నివసిస్తున్న స్థానికుల నుంచి ఓ కారు అనుమానాస్పందంగా ఉన్నట్టు సమాచారం అందింది. అక్కడికి వెళ్లిన పోలీసులు కారును పరిశీలించగా.. వెనక సీట్లో వైశాలీ డెడ్ బాడీ లభ్యమైంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని బాడీని కుటుంబ సభ్యులకు అందించారు. కేసుపై విచారణ ప్రారంభించారు. 

click me!