
టెలివిజన్ ఈవెంట్స్, షోస్ కి మహేష్ గెస్ట్ గా రావడం చాలా అరుదు. తన మూవీ ప్రమోషన్స్, బ్రాండ్ ఎండార్స్ మెంట్ ఇంటర్వ్యూలకు మాత్రమే హాజరవుతున్నారు. తాజాగా మహేష్ జీ తెలుగులో ప్రసారమైన డాన్స్ ఇండియా డాన్స్ రియాలిటీ షోకి గెస్ట్ గా వచ్చారు. కూతురు సీతారతో పాటు ఆయన హాజరయ్యారు. ఎన్నడూ లేని విధంగా మహేష్ గడ్డం, మీసాలతో కనిపించడం ఆసక్తికరంగా మారింది. అతి త్వరలో త్రివిక్రమ్ మూవీ మొదలుకానుండగా మహేష్ మేక్ ఓవర్ లో ఉన్నారని అర్థం అవుతుంది.
ఇదిలా ఉంటే మహేష్ బాబు ఆ ఈవెంట్ కి గెస్ట్ గా రావడం వెనుక పెద్ద తతంగమే ఉందంటున్నారు. మహేష్ తో జీ తెలుగు ఛానల్ భారీ డీల్ కుదుర్చుకుందట. ఏడాది పాటు ఆ ఛానల్ లో ప్రసారమయ్యే వివిధ షోస్, ఈవెంట్స్, సీరియల్స్ లో కనిపించేందుకు గాను రూ. 9 కోట్లు చెల్లిస్తున్నారట. సింగింగ్, డాన్సింగ్ షోస్ ఫైనల్స్, ప్రత్యేక ఈవెంట్స్ కి మహేష్ బాబు హాజరుకానున్నారట. ఇది నిజంగా మహేష్ ఫ్యాన్స్ తో పాటు బుల్లితెర ప్రేక్షకులు ఆనందించాల్సిన విషయమే.
సో ఇకపై మహేష్ జీ తెలుగులో పలు కార్యక్రమాల్లో కనిపించి సందడి చేయనున్నారన్న మాట. మరోవైపు ఎస్ఎస్ఎంబి 28లో త్రివిక్రమ్ మహేష్ ని సరికొత్తగా ప్రజెంట్ చేయనున్నారనే టాక్ వినిపిస్తుంది. అలాగే వచ్చే ఏడాది ప్రారంభంలోనే రాజమౌళి మూవీ సెట్స్ పైకి వెళ్లే సూచనలు కలవు. మొత్తంగా రానున్న కాలమంతా మహేష్ ఫ్యాన్స్ కి వరుస పండుగలు రానున్నాయి. ఇక మహేష్ లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట మిక్స్డ్ టాక్ అందుకుంది. కలెక్షన్స్ పరంగా దుమ్ముదులిపింది. దర్శకుడు పరుశురాం తెరకెక్కించిన సర్కారు వారి పాట భారీ వసూళ్లు దక్కించుకుంది .