'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్.. కోటి వ్యూస్ తో రికార్డ్!

By Udaya DFirst Published 16, Feb 2019, 4:48 PM IST
Highlights

ఎన్టీఆర్ ఆశీస్సులతో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ట్రైలర్ కోటి వ్యూస్ ని రాబట్టిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. 

ఎన్టీఆర్ ఆశీస్సులతో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ట్రైలర్ కోటి వ్యూస్ ని రాబట్టిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. దివంగత ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చిన తరువాత ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనే విషయాలతో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రూపొందించారు.

ఈ సినిమాను తక్కువ క్వాలిటీతో రూపొందించినా.. సినిమాలో కంటెంట్, తన ప్రమోషన్స్ తో జనాల్లోకి తీసుకువెళ్లడంలో వర్మ సక్సెస్ అవుతున్నాడనే చెప్పాలి. ప్రేమికుల రోజు దినోత్సవం సందర్భంగా వర్మ విడుదల చేసిన ఈ ట్రైలర్ కి ఇప్పటివరకు కోటి వ్యూస్ వచ్చాయి.

సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారిన ఈ ట్రైలర్ రిపీట్ మోడ్ లో చూస్తున్నారు ఆడియన్స్. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా రిలీజ్ డేట్ 'మహానాయకుడు' సినిమా మీద ఆధారపడి ఉందని వర్మ ముందే చెప్పారు,

1 CRORE VIEWS on https://t.co/Otvxvi35u2 As per digital team5.7 MYouTube .TVNXT185K Hotshot684K MM35KYoung Andhra 66KOnline India245K Filmy Focus26K TFN386KTelugu Cinema.1M FB.287K
Along with many other uploads on random FB pages and channels.
NTR BLESSED

— Ram Gopal Varma (@RGVzoomin)
Last Updated 16, Feb 2019, 4:48 PM IST