దర్శకుడిగా మారనున్న ప్రియదర్శి.. హీరో ఎవరు.?

By Udaya DFirst Published 16, Feb 2019, 4:36 PM IST
Highlights

కమెడియన్స్ కు కాస్త పాపులారిటి వచ్చాక వాళ్లు ప్రమోషన్ తీసుకోవాలనుకుంటున్నారు. కొందరు కమెడియన్స్ హీరోలుగా సినిమాలు చేసి చతికిలపడితే, మరికొందరు డైరక్టర్స్ గా సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నారు. 

కమెడియన్స్ కు కాస్త పాపులారిటి వచ్చాక వాళ్లు ప్రమోషన్ తీసుకోవాలనుకుంటున్నారు. కొందరు కమెడియన్స్ హీరోలుగా సినిమాలు చేసి చతికిలపడితే, మరికొందరు డైరక్టర్స్ గా సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నారు. వేణుమాధవ్ లాంటి వాళ్లు నిర్మాతగా సినిమా చేసి ఆ తర్వాత ఆఫర్స్ లేక పరిశ్రమ నుంచి మాయమైపోయారు. 

అయితే అందరి అదృష్టమూ అలా ఉంటుందని చెప్పలేం. కొందరు సక్సెస్ కావచ్చు కూడా.  ఈ మధ్యకాలంలో కమిడియన్ గా బిజీ అవుతున్న ప్రియదర్శి ఇప్పుడు డైరక్టర్ గా అవతారమెత్తుతున్నారు.  

విజయ్ దేవరకొండ చిత్రం పెళ్లిచూపులు సినిమాతో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి, త్వరలో కొత్త డైరక్టర్ కాబోతున్నారు.   ఇప్పటి వరకు నటుడిగానే తెలిసిన ప్రియదర్శి..డైరక్ట్ చేసే సబ్జెక్ట్ కామెడీనీ, సీరియస్సా అనేది ఇంకా బయిటకు రాలేదు. అయితే ఇదేమీ రూమర్ మాత్రం కాదు . 

ఎందుకంటే.... ఈ విషయాన్ని మిఠాయ్‌ ఆడియో ఫంక్షన్‌లో దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ వెల్లడించి కన్ఫర్మ్ చేసారు. అయితే గతంలోనూ దర్శకత్వం చేసే ఆలోచన ఉన్నట్టుగా చెప్పారు  ప్రియదర్శి. అయితే తరుణ్ భాస్కర్ ఈ మాట చెప్పాక మాత్రం  ఈ వేదిక మీద మాత్రం ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. అయితే ఇంతకీ ప్రియదర్శి డైరక్ట్ చేయబోయే హీరో ఎవరు. తన మిత్రుడు విజయ్ దేవరకొండ అయ్యింటాడు అని ఇండస్ట్రీలో కామెంట్స్ వినపడుతున్నాయి. 

Last Updated 16, Feb 2019, 4:36 PM IST