'దేవ్'కు కోతెట్టేశారు.. కలిసొచ్చి కలెక్షన్స్ పెరుగుతాయా?

By Udaya DFirst Published 16, Feb 2019, 4:24 PM IST
Highlights

కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో రూపొందిన ‘దేవ్’చిత్రం లవర్స్ డే సందర్భంగా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. రొమాంటిక్  అడ్వంచర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. 

కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో రూపొందిన ‘దేవ్’చిత్రం లవర్స్ డే సందర్భంగా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. రొమాంటిక్  అడ్వంచర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.  ఇంట్రస్ట్ లేని స్క్రీన్ ప్లే తో   సినిమా బోరింగ్‌గా ఉందని రివ్యూలు రావటం, మౌత్ టాక్ స్ప్రెడ్ అవటం జరిగింది. దాంతో... నెగిటివ్ టాక్ ప్రభావం తొలిరోజు కలెక్షన్లపై భారీగానే పడింది. దీంతో ‘దేవ్’ నిరాశాజనకమైన వసూళ్లు రాబట్టాడు.

అయితే ఈ చిత్రానికి 3 గంటల నిడివి ఉండడంతో ప్రేక్షకులు బోర్ ఫీలయ్యారని నిర్మాతలు భావించారు. దాంతోచిత్ర యూనిట్ ఆలోచించుకుని   అనవసరమైన సన్నివేశాలు తొలిగించి 15 నిమిషాల రన్ టైం ను తగ్గించేశారు.  ఈ రన్ టైం తగ్గించిన నేపధ్యంలో సినిమాకు ఏమన్నా మంచి టాక్ వచ్చి కలెక్షన్స్ కు ఉపయోగపడుతుందేమో చూడాలి.   

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం .. తమిళనాడులో రూ.3.31కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.1.20కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.55లక్షలు, ఓవర్సీస్‌లో రూ.65లక్షలు కలెక్షన్లు రాబట్టింది. తొలిరోజే కలెక్షన్లు ఇంత దారుణంగా ఉంటే వీకెండ్ లో సినిమా నిలబడటం కష్టమని తేల్చేస్తున్నారు.

Last Updated 16, Feb 2019, 4:24 PM IST