
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ప్రభాస్ చేస్తున్న చిత్రాలు చూస్తుంటే ఒకదానిని మించేలా మరొకటి అన్నట్లుగా ఉన్నాయి. ఈ సంక్రాంతికి ప్రభాస్ నుంచి రాధే శ్యామ్ చిత్రం రాబోతోంది. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. రాధే శ్యామ్ చిత్రం తర్వాత సలార్, ఆది పురుష్ చిత్రాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.
ఇక నాగ్ అశ్విన్ దర్శత్వంలో ప్రాజెక్ట్ కె, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ చిత్రాల్లో ప్రభాస్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ అభిమానులంతా రాధేశ్యామ్ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ప్రభాస్ తో రామాయణ గాధని 'ఆదిపురుష్' గా తెరకెక్కిస్తున్న ఓం రౌత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రామాయణం 7000 సంవత్సరాల క్రితం జరిగిన కథ. రామాయణం మొత్తాన్ని ఒక్క చిత్రంలో చూపించడం కష్టం. అందుకే వాల్మీకి రామాయణంలో కీలక భాగాన్ని నా కోణంలో చూపించబోతున్నాను. ఈ స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత రాముడిగా బాగా కనిపించే వ్యక్తినే ఎంచుకోవాలి అనుకున్నా. అప్పుడు నాకు గుర్తుకు వచ్చింది ప్రభాస్ మాత్రమే. స్వచ్ఛమైన మనసు, కల్మషం లేని వ్యక్తిత్వం నాకు ప్రభాస్ లో కనిపించాయి. అందుకే ఆదిపురుష్ చిత్రానికి ప్రభాస్ ని ఎంచుకున్నా. ఒకవేళ ప్రభాస్ కు ఈ స్క్రిప్ట్ నచ్చకపోయి ఉంటే ఈ సినిమాని పూర్తిగా పక్కన పెట్టేసేవాడిని అని ఓం రౌత్ అన్నారు.
ఆదిపురుష్ చిత్ర షూటింగ్ 103 రోజుల్లో పూర్తి చేశారు. కానీ విజువల్ ఎఫెక్ట్స్ కోసం దర్శకుడు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అందుకే ఈ చిత్రాన్ని తీరిగ్గా వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్ చేస్తున్నారు. సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. ఇక లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నాడు.