Balakrishna Unstoppable show: విజయశాంతితో బాలయ్యకు ఎందుకు చెడింది..అన్ స్టాపబుల్ కి వస్తే తేలిపోతుందిగా!

Published : Dec 25, 2021, 02:41 PM IST
Balakrishna Unstoppable show: విజయశాంతితో బాలయ్యకు ఎందుకు చెడింది..అన్ స్టాపబుల్ కి వస్తే తేలిపోతుందిగా!

సారాంశం

2021 బాలయ్య (Balakrishna)కు బాగా కలిసొచ్చింది. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న ఆయన అఖండ మూవీతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ వంద కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టించింది. దాదాపు రూ. 115 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టిన అఖండ రన్ ఇంకా థియేటర్స్ లో కొనసాగుతుంది.   

2021 బాలయ్య (Balakrishna)కు బాగా కలిసొచ్చింది. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న ఆయన అఖండ మూవీతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ వంద కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టించింది. దాదాపు రూ. 115 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టిన అఖండ రన్ ఇంకా థియేటర్స్ లో కొనసాగుతుంది. 

మరోవైపు ఆయన హోస్ట్ గా సత్తా చాటారు. మొదటి షోతోనే తానేమిటో నిరూపించుకున్నారు. బాలయ్యతో టాక్ షోనా? అట్టర్ ప్లాప్ ఖాయమని విమర్శలు చేసినవారికి భారీ షాక్ ఇచ్చారు. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో స్ట్రీమ్ అవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షో ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. గెస్ట్ ఎవరైనా వాళ్ళ జీవితాల్లో చోటు చేసుకున్న, ప్రచారమైన వివాదాలను తెరపైకి తేవడం ద్వారా బాలయ్య షోకి ప్రత్యేకత తీసుకొచ్చారు. 

కాగా అన్ స్టాపబుల్ టాక్ షో (Unstoppable talk show)సీజన్ వన్ ముగియనుంది. మహేష్ బాబు ఎపిసోడ్ తో ఈ సీజన్ ముగించనున్నట్లు ఆహా యాజమాన్యం అధికారికంగా తెలియజేశారు. ఇక హోస్ట్ బాలయ్యతో మహేష్ సంభాషణ ఎలా ఉండనుందనే ఆసక్తి చాలా మందిలో కొనసాగుతుంది. అయితే బాలయ్య ఫ్యాన్స్ తో పాటు ఈ టాక్ షోని ఫాలో అవుతున్న ఆడియన్స్ ఓ గెస్ట్ రావాలంటూ కోరుకుంటున్నారు. 

లేడీ అమితాబ్ గా టాలీవుడ్ ని ఏలిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి బాలయ్య టాక్ షోకి గెస్ట్ గా వస్తే చూడాలని ఆశపడుతున్నారు. దానికి కారణం బాలయ్యతో విజయశాంతి ప్రత్యేక అనుబంధం కలిగివున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో 17 సినిమాల వరకు తెరకెక్కాయి. లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, ముద్దుల మామయ్య, మువ్వ గోపాలుడు వంటి  బ్లాక్ బస్టర్స్ వీరి కాంబినేషన్ లో తెరకెక్కాయి. 

1993లో వచ్చిన నిప్పురవ్వ వీరిద్దరూ కలిసి నటించిన చివరి చిత్రం. నిప్పురవ్వ చిత్రం తర్వాత మరలా బాలయ్య, విజయశాంతి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. దీని కారణం మనస్పర్థలే అంటూ ఓ రూమర్ ప్రచారంలో ఉంది. నిప్పురవ్వ షూటింగ్ సమయంలో బాలకృష్ణ, విజయశాంతి గొడవపడ్డారట. అది చిలికి చిలికి గాలివాన కావడంతో కలిసి నటించకూడదని నిర్ణయించుకున్నారట. విజయశాంతి (Vijayashanthi)మాత్రం దానికి మరొక కారణం చెప్పారు. 
నిప్పురవ్వ మూవీ తర్వాత నా రెమ్యునరేషన్ బాగా పెరిగింది. వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నాను. హీరోలకు సమానంగా నా రెమ్యూనరేషన్ ఉండేది. దీంతో స్టార్ హీరోల సినిమాలలో నటిస్తే బుడ్జెట్ పెరిగిపోతుంది. అందుకే బాలయ్యతో కలిసి నటించడం కుదరలేదని విజయశాంతి వివరణ ఇచ్చారు. అయితే ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాలంటే విజయశాంతి అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొనాలని కోరుకుంటున్నారు. 

Also read NBK shock to Nagarjuna: నాగార్జునకి చెక్‌ పెట్టబోతున్న బాలకృష్ణ.. బిగ్‌బాస్‌ 6కి హోస్ట్ ఎవరంటే?

ప్రచారంలో ఉన్న వివాదాలనే బాలయ్య షోలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కాబట్టి బాలకృష్ణ ఈ రూమర్ పై క్లారిటీ ఇస్తారన్న నమ్మకం ఉంది. అయితే మొదటి సీజన్ పూర్తి కాగా... ఇక అవకాశం లేదు. మరి సెకండ్ సీజన్లో అయినా ఫ్యాన్స్ కోరిక తీరాలని, వాళ్ళ ప్రశ్నలకు సమాధానం దొరకాలని కోరుకుంటున్నారు. 

Also read Mahesh with Balakrishna: మహేష్ తో ముగించనున్న బాలకృష్ణ

PREV
click me!

Recommended Stories

Bigg Boss వల్ల చాలా నష్టపోయాను, అవకాశాలు కోల్పోయాను, టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Varun Sandesh: అందుకే మాకు పిల్లలు పుట్టలేదు, వచ్చే ఏడాది గుడ్ న్యూస్ చెబుతామంటున్న హీరో