OG Glimpse: పవన్‌ కళ్యాణ్‌ `ఓజీ` గ్లింప్స్ ఎలా ఉందంటే? ఒక్క లుక్‌తోనే పూనకాలు

Published : Sep 02, 2025, 04:49 PM IST
Og movie

సారాంశం

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తోన్న `ఓజీ` మూవీ నుంచి గ్లింప్స్ విడుదలైంది. ఆయన బర్త్ డే సందర్బంగా ఈ గ్లింప్స్ ని విడుదల చేశారు. మరి ఈ గ్లింప్స్ ఎలా ఉందంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా,  'ఓజీ' చిత్ర బృందం అభిమానులకు డబుల్ బొనాంజా ఇచ్చింది. రెండు కొత్త పోస్టర్లతోపాటు “HBD OG - LOVE OMI” పేరుతో గ్లింప్స్ ను విడుదల చేసింది. ఇందులో వింటేజ్‌ లుక్‌లో పవన్‌ ఆకట్టుకున్నారు. కత్తిపట్టి రక్తం మరకలతో ఉన్న ఆయన లుక్‌ మతిపోయేలా ఉంది. గ్లింప్స్  చివర్లో పవన్‌ని లుక్‌లో చూపించారు. అదే ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంది.

`ఓజీ`లో వింటేజ్‌ లుక్‌లో పవన్‌ కళ్యాణ్‌

మరోవైపు వింటేజ్ లుక్ లో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్న పోస్టర్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈ పోస్టర్ రాకతో సామాజిక మాధ్యమాల్లో పవన్‌ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పవన్ ను ఈ తరహా లుక్ లో చూసి చాలా కాలం అయిందని అభిమానులు, ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.  

పూనకాలు తెప్పించేలా `ఓజీ` గ్లింప్స్ 

పవన్ కళ్యాణ్ అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ చిత్ర బృందం `HBD OG - LOVE OMI` అనే గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇందులో పోర్ట్ ఏరియాలో ఇమ్రాన్‌ హష్మిని పరిచయం చేశారు. ఆయన డియర్‌ ఓజీ.. నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురుచూస్తున్నా. నీ ఓమీ. హ్యాపీ బర్త్ డే ఓజీ అని చెప్పారు. ఇందులో ఇమ్రాన్‌ హష్మీని ఎలివేట్‌ చేశారు. ఓజీ తరహాలో ఆయన్ని చూపించడం విశేషం. అంతే స్టయిలీష్‌గానూ చూపించారు. చివర్లో వైట్‌ షర్ట్, బ్లాక్‌ ప్యాంట్‌లో కత్తి పట్టి, రక్తం మరకలతో పవన్‌ పవర్‌ఫుల్‌ లుక్‌ని చూపించారు. గ్లింప్స్ మాత్రం అదిరిపోయింది. దానికి తగ్గట్టుగానే బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ మతిపోయేలా ఉంది. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఈ గ్లింప్స్ ఉంది. అయితే పవన్‌ని ఎక్కువ చూపించకపోవడంతో ఫ్యాన్స్ కొంత డిజప్పాయింట్‌ అవుతున్నారు. కానీ ఈ గ్లింప్స్ మాత్రం ఇప్పుడు ట్రెండ్‌ అవుతుంది.

ఇమ్రాన్‌ హష్మిని పవర్‌ఫుల్‌గా చూపించిన `ఓజీ` టీమ్‌

మొదటి నుండి 'ఓజీ'పై అంచనాలు భారీగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్‌ను గంభీరమైన అవతారంలో చూపించిన `హంగ్రీ చీతా` గ్లింప్స్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు “HBD OG - LOVE OMI” గ్లింప్స్‌ సినిమాపై అంచనాలను మరింతగా పెంచుతుంది. తాజా గ్లింప్స్ లో ఇమ్రాన్ హష్మీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పవన్ కళ్యాణ్ ని ఢీ కొట్టే బలమైన పాత్రలో ఆయన కనువిందు చేయనున్నారు. `ఓజీ` సినిమా కోసం ఇప్పుడుపవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు.

సెప్టెంబర్‌ 25న `ఓజీ` విడుదల

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓజాస్‌ గంభీర అనే శక్తివంతమైన పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంగీత సంచలనం ఎస్. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 25, 2025న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌