జాన్వీ కపూర్‌ `పరమ్ సుందరి` 3 రోజుల కలెక్షన్స్.. ఇలా అయితే కష్టమే

Published : Aug 31, 2025, 10:39 PM IST
Param Sundari

సారాంశం

జాన్వీ కపూర్‌ నటించిన `పరమ్ సుందరి` సినిమా ఆదివారం సాయంత్రం వరకు ₹8.14 కోట్లు వసూలు చేసి, మొత్తం కలెక్షన్ ₹24.64 కోట్లకు చేరుకుంది.  

జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన `పరమ్ సుందరి` సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్‌ కలెక్షన్లని సాధిస్తోంది. ఈ సినిమా ఉత్తరాది అబ్బాయి, దక్షిణాది అమ్మాయి ప్రేమకథ. ఇలాంటి కథతో చాలా సినిమాలు వచ్చాయి. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే సినిమా నెమ్మదిగా పుంజుకోవడం విశేషం. కలెక్షన్ల పరంగా సత్తా చాటుతోంది.

Sacnilk నివేదిక ప్రకారం, `పరమ్ సుందరి` సినిమా మూడో రోజు (మొదటి ఆదివారం) సాయంత్రం 8 గంటల వరకు ₹8.14 కోట్లు వసూలు చేసింది. దీంతో మొత్తం కలెక్షన్స్ ₹24.64 కోట్లకు చేరుకున్నాయి.

జాన్వీ కపూర్ మొదటి సినిమా `ధడక్` మూడో రోజు (ఆదివారం) ₹13.92 కోట్లు వసూలు చేసింది. `పరమ్ సుందరి` సినిమా సాయంత్రం 8 గంటల వరకు ₹8.14 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఆదివారం రాత్రికి ₹10 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. కానీ ధడక్ సినిమా మొదటి ఆదివారం వసూళ్లను దాటడం కష్టమే.

`పరమ్ సుందరి` బాక్సాఫీస్ కలెక్షన్స్:
రోజు 1 (శుక్రవారం)- ₹7.25 కోట్లు
రోజు 2 (శనివారం)- ₹9.25 కోట్లు
రోజు 3 (ఆదివారం)- ₹8.14 కోట్లు (సాయంత్రం 8 గంటల వరకు)
మొత్తం- ₹24.64 కోట్లు (ప్రాథమిక అంచనా)

`పరమ్ సుందరి` సినిమా ₹70 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో నిర్మాణ ఖర్చులు, నటీనటుల పారితోషికం, సంగీతం, ప్రచారం వంటివి ఉన్నాయి. సినిమాలోని సన్నివేశాలు, సెట్స్, పాటల కోసం ఎక్కువ ఖర్చు చేశారు.

జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ప్రచారం కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేశారు. సినిమా గురించి చాలా చర్చ జరిగింది. కానీ బడ్జెట్ వసూలవుతుందా, బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందా అనేది చూడాలి. కలెక్షన్లు మాత్రం డీసెంట్‌గా ఉన్నాయి. సోమవారం వసూళ్లని బట్టి ఈ మూవీ సక్సెస్‌ దిశగా వెళ్తుందా? లేక ఫ్లాప్‌గా మిగిలిపోతుందా అనేది చూడాలి. ఇంతకంటే కలెక్షన్లు తగ్గితే మాత్రం హిట్‌ కావడం కష్టమే. ఈ చిత్రానికి తుషార్‌ జలోటా దర్శకత్వం వహించారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే
Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్