
Venkatesh Daggubati: తెలుగు సినీ నటుడు వెంకటేష్ దగ్గుపాటి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని హీరో వెంకటేష్ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్టు వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగింది?
టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్.. తాను 12 సంవత్సరాలుగా పెంచుకుంటున్న పెట్ డాగ్ ‘గూగుల్’మృతి చెందింది. దీంతో హీరో వెంకటేష్ ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా 'ఐ మిస్ యూ' అంటూ పోస్టు చేస్తూ.. ఆ పెట్ డాగ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా హీరో వెంకటేష్ ఇక వీడ్కోలు అంటూ పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
ఐ మిస్ యూ 'గూగుల్'
“నా ప్రియమైన గూగుల్, నువ్వు గత 12 సంవత్సరాలుగా మా జీవితాల్లో భాగమయ్యావు. నువ్వు మా జీవితంలో అందమైన జ్ఞాపకాలు నింపావు. నువ్వే మా సన్‌షైన్. నీవు లేని లోటు మాటల్లో చెప్పలేను. నిన్నుమేము చాలా మిస్ అవుతున్నాం.మై డియర్ ఫ్రెండ్… ఇక వీడ్కోలు” అంటూ వెంకటేష్ తన అనుబంధాన్ని వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఫ్యాన్స్ స్పందిస్తూ, “RIP Google”, “ఎప్పటికీ గుర్తుండిపోతావు” వంటి కామెంట్లతో సానుభూతి తెలిపారు.
తాజాగా వెంకటేష్ వరుస సినిమాలతో దూసుకపోతున్నారు. గతేడాది విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఆయన, ఈ ఏడాది కూడా వరుసగా కొత్త ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ నటించే కొత్త సినిమా ‘వెంకట రమణ’ అనే టైటిల్ ఖరారు చేశారు. ప్రస్తుతం సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ కొనసాగుతున్నాయి. సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం.
అలాగే, అనిల్ రావిపూడి–చిరంజీవి కాంబోలో వస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో వెంకటేష్ ఓ కామియో రోల్ లో నటిస్తారని ఫిల్మ్ న్యూస్ లో వార్తలు ఉన్నాయి. ఈ న్యూస్ పై డైరెక్టర్ రావిపూడి కూడా క్లారిటీ ఇచ్చారు. త్వరలో వెంకీ మామ మెగాస్టార్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారట.
‘లక్ష్మీ’ కాంబో రిపీట్?
అలాగే.. మరో క్రేజీ ప్రాజెక్ట్ కు విక్టరీ వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. స్టార్ డైరెక్టర్ వి.వి వినాయక్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారట వెంకటేష్. ఈ సినిమా మాస్, యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతుందట. ఈ కాంబో లో గతంలో వచ్చిన ‘లక్ష్మీ’మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో వెంకీ- వినాయక్ కాంబోలో మరో భారీ బాక్ల్ బస్టర్ పడబోతుందని ఫ్యాన్ భావిస్తున్నారు.