పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో `ఓ పిల్లా నీ వ‌ల్లా`

Published : Jan 24, 2017, 01:06 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో `ఓ పిల్లా నీ వ‌ల్లా`

సారాంశం

కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, సూర్య శ్రీనివాస్ , మోనికా సింగ్, షాలు చౌరాసియా లు నటీనటులుగా  `ఓ పిల్లా నీ వ‌ల్లా`

కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, సూర్య శ్రీనివాస్  , మోనికా సింగ్, షాలు చారసియా న‌టీన‌టులుగా బిగ్ విగ్ మూవీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై కిషోర్ ద‌ర్శ‌క నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం `ఓ పిల్లా నీ వ‌ల్లా`. ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ఈ సంద‌ర్భంగా .. చిత్ర ద‌ర్శ‌క నిర్మాత కిషోర్ మాట్లాడుతూ - ``మా బ్యాన‌ర్‌లో రూపొందుతున్న ఓ పిల్లా నీ వ‌ల్లా చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ల‌వ్, కామెడి, యాక్ష‌న్ స‌హా అన్నీ ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయి. కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్ స‌హా న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ స‌పోర్ట్ తో సినిమాను అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేయ‌గ‌లిగాం. మ‌ధు పొన్నాస్ సంగీతం, షోయ‌బ్ అహ్మ‌ద్ సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. త్వ‌ర‌లోనే ఆడియో విడుద‌ల చేసి, సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం`` అన్నారు. 

కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్, షాలు చారసియా, సూర్య శ్రీనివాస్, సుద‌ర్శ‌న్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సాహిత్యంః కృష్ణ చిన్ని మ‌దినేని, క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల‌, యాక్ష‌న్ః మార్ష‌ల్ ర‌మ‌ణ‌, సినిమాటోగ్ర‌ఫీః షోయబ్ అహ్మ‌ద్ కె.ఎం., ఎడిట‌ర్ః అనిల్ కింతాడ‌, కోరియేగ్రాఫి : జితేంద్ర సంగీతంః మ‌ధు పొన్నాస్‌, సహా నిర్మాత : మౌర్య నిర్మాతః కిషోర్‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వంః కిషోర్‌.

PREV
click me!

Recommended Stories

కమల్ హాసన్ సినిమాపై శ్రుతిహాసన్ ఆవేదన... అభిమానులపై సంచలన కామెంట్స్..
Chiranjeevi: చిరంజీవి సినిమా ఫ్లాప్ అయితే మందు పార్టీ చేసుకున్న హీరో.. చివరికి ఆంజనేయస్వామిపై ఒట్టేసి..