వివాదాల్లో నటి, ఎంపి నుస్రత్‌ జహాన్‌.. తన బిడ్డకి తండ్రెవరు? మీడియా ముందుకు ప్రియుడి మాజీ భార్య..

Published : Sep 15, 2021, 09:23 PM IST
వివాదాల్లో నటి, ఎంపి నుస్రత్‌ జహాన్‌.. తన బిడ్డకి తండ్రెవరు? మీడియా ముందుకు ప్రియుడి మాజీ భార్య..

సారాంశం

ఇటీవల నుస్రత్‌ డెలివరీ తర్వాత తనతోపాటు యష్‌ దాస్‌ గుప్తా కూడా ఉండటం విశేషం. వీరిద్దరు ఆసుపత్రి నుంచి బయటకురావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

బెంగాలి నటి, టీఎంసీ ఎంపి నుస్రత్‌ జహాన్‌ మరోసారి వివాదాల్లో ఇరుక్కున్నారు. ఆమె ఇటీవల ఆగస్ట్ 26న పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. అయితే గతంలో ఆమె కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరు? అనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇటీవల నుస్రత్‌ డెలివరీ తర్వాత తనతోపాటు యష్‌ దాస్‌ గుప్తా కూడా ఉండటం విశేషం. వీరిద్దరు ఆసుపత్రి నుంచి బయటకురావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

అయితే గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో తన భర్త కోల్‌కతాకి చెందిన వ్యాపారవేత్త నిఖిల్‌ జైన్‌ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత ఆమె గర్భవతి అయ్యింది. ఆమె వివాహం చెల్లదనే వార్తలు ఊపందుకున్నాయి. దీంతో తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరనేది పెద్ద చర్చ నడిచింది. ప్రియుడు యష్‌దాస్‌ గుప్తా తెరపైకి రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే యష్‌ దాస్‌ గుప్తా ముంబయికి చెందిన ఓ మీడియా సంస్థలో పనిచేస్తున్న స్వేత సింగ్‌ ని పెళ్లి చేసుకున్నాడని, వీరికి పదేళ్ల బాలుడు కూడా ఉన్నాడని తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వేత తెలిపింది. ఫస్ట్ టైమ్‌ ఆమె మీడియా ముందుకొచ్చి ఈ విషయాలను వెల్లడించింది.

అయితే అతను తన కుమారుడికి తండ్రి మాత్రమే అని, ఇప్పుడు తన నుంచి వెళ్లిపోయాక తనతో సంబంధాలు లేవని పేర్కొంది. తమ ఫ్యామిలీని వదిలేసినప్పుడే అంతా ముగిసిపోయిందని తెలిపింది. మరోవైపు నుస్రత్‌ గురించి చెబుతూ, ఆమె పేరు విన్నా గానీ, ఆమె ఎవరో తనకు తెలియదని పేర్కొంది. గతేడాది లాక్‌డౌన్‌ టైమ్‌లో `ఎస్‌ఓఎస్‌ కోల్‌కతా` సినిమా షూటింగ్‌ టైమ్‌లో నుస్రత్‌, యష్‌ దాస్ గుప్తా ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి వీరిద్దరు డేటింగ్‌ చేస్తున్నారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?