NTR30 Shoot Begins : ‘ఎన్టీఆర్30’ సెట్స్ లో అడుగుపెట్టిన తారక్.. ఫస్ట్ షెడ్యూల్ డిటేయిల్స్..

By Asianet News  |  First Published Mar 31, 2023, 1:16 PM IST

దాదాపు రెండేండ్లకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ షూటింగ్ కు హాజరయ్యారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న NTR30 షూటింగ్ ఇవ్వాళ ప్రారంభమైంది. మొత్తానికి తారక్ సెట్స్ లో అడుపెట్టారు.
 


‘ఆర్ఆర్ఆర్’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) నటించబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ NTR30. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. యువసుధ ఆర్ట్స్,  ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక మార్చి 23 చిత్రం పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈక్రమంలో షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందని ఎదురుచూసిన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అందింది. ఈరోజే ‘ఎన్టీఆర్30’ ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభించారు. హైదరాబాద్ లోనే షూటింగ్ మొదలు పెట్టారు. 

హైదరాబాద్ లోని శంషాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అక్కడే ఏర్పాటు చేసిన ఓ భారీ షిప్ సెట్ లో షూటింగ్ కొనసాగుతుందని అర్థమవుతోంది. తొలిరోజు తారక్ పై కొన్ని కీలకమైన సీన్స్ షూట్ చేయనున్నారు. అయితే ఇవ్వాళ్టి షూట్ ను ఈరోజు రాత్రి నుంచి ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలో ముందుగానే తారక్ సెట్స్ కు చేరుకున్నారు. ఈ షెడ్యూల్ వారం పాటు కొనసాగనుంది.  షూటింగ్ ఫస్ట్ డేకు ఎన్టీఆర్ తో పాటు నటుడు బ్రహ్మాజీ కూడా హాజరయ్యారు. సెట్స్ లో అడుగుపెట్టిన తారక్ కు ఫ్యాన్స్, యూనిట్ వెల్కమ్ పలికింది. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ తర్వాత ఎన్టీఆర్ సెట్స్ లో అడుగపెట్టక నేటికీ 582 పూర్తైంది. ఎట్టకేళలకు మళ్లీ యాక్షన్ షురూ చేశారు. 

Latest Videos

హైదరాబాల్ లో నిర్మించి భారీ షిప్ సెట్స్ లోనే కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఈ హ్యూజ్ సెట్ కు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్ని బేట్స్ అదిరిపోయే యాక్షన్స్ ను రూపొందిస్తున్నారు. ఇక VFX కోసం హాలీవుడ్ వీఎఫ్ ఎక్స్ సూపర్ వైజర్ బ్రాడ్ మిన్నిచ్ రంగంలోకి దిగారు. భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో హాలీవుడ్ ప్రముఖులు సైతం భాగం కావడం సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. 

సినిమా ఓపెనింగ్ లో దర్శకుడు కొరటాల కథను సైతం రివీల్ చేసిన విషయం తెలిసిందే. ప్రాణం మీద, బతుకు మీద ఏమాత్రం భయంలేని మృగాలకు భయం చెప్పే క్యారెక్టరే ఎన్టీఆర్ అని చెప్పారు. దీంతో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో అర్థం అవుతోంది. చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏఢాది ఏప్రిల్ 5న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది. 

 

HERO back to movie sets after 582 DAYS....
ACTION BEGINS Today 💥💥💥

All the Best Anna.... ❤ pic.twitter.com/NeY7cugjSs

— 𝐍𝐓𝐑 𝐓𝐡𝐞 𝐒𝐭𝐚𝐥𝐰𝐚𝐫𝐭 (@NTRTheStalwart)
click me!