అప్పుడు బాహుబలికి ప్లస్ అయ్యాడు, ఇప్పుడు దసరాని నిలబెట్టాడు.. తెరవెనుక హీరో అతడే

Published : Mar 31, 2023, 01:10 PM IST
అప్పుడు బాహుబలికి ప్లస్ అయ్యాడు, ఇప్పుడు దసరాని నిలబెట్టాడు.. తెరవెనుక హీరో అతడే

సారాంశం

నేచురల్ స్టార్ నానికి చాలా కాలం తర్వాత సాలిడ్ హిట్ లభించింది. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన దసరా చిత్రం గురువారం శ్రీరామనవమి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

నేచురల్ స్టార్ నానికి చాలా కాలం తర్వాత సాలిడ్ హిట్ లభించింది. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన దసరా చిత్రం గురువారం శ్రీరామనవమి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే దసరా చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ మొదలయ్యాయి. ప్రస్తుతం దసరా చిత్రం రికార్డు వసూళ్లతో, సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. 

హిందీలో కూడా ఈ చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఈ తరహా మాస్ అవతారం, రస్టిక్ నేచర్ ఉన్న కథలో నాని నటించడం ఇదే తొలిసారి. శ్రీకాంత్ ఓదెల, నాని, కీర్తి సురేష్ కలసి సూపర్బ్ గా వర్కౌట్ చేశారు. కంటెంట్ బాగున్న తెలుగు చిత్రాలు హిందీలో రాణిస్తున్నాయి. 

దసరా చిత్రం హిందీలో హిట్ కావడానికి ప్రధానంగా ఓ కారణం కనిపిస్తోంది. ఏ డబ్బింగ్ చిత్రం అయినా విజయం సాధించాలి అంటే ప్రధానంగా డబ్బింగ్ బాగా కుదరాలి. లీడ్ రోల్స్ చేసే నటీనటుల బాడీ లాంగ్వేజ్ కి అనుగుణంగా డబ్బింగ్ కుదరాలి. లేకుంటే డైలాగ్స్ వినసొంపుగా, రక్తి కట్టించే విధంగా అనిపించవు. 

ప్రభాస్ సాహో చిత్రం విషయంలో డబ్బింగ్ లోపం కనిపించింది. ఇక రాధే శ్యామ్ చిత్రానికి ప్రభాస్ సొంతంగా హిందీలో డబ్బింగ్ చెప్పుకున్నాడు. అది కూడా కలసి రాలేదు. దసరా హిందీ వర్షన్ లో నాని డైలాగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. నానికి హిందీ డబ్బింగ్ చెప్పిన తెరవెనుక హీరో ఒకరు ఉన్నారు. అతడే శరద్ కేల్కర్. 

బాహుబలి రెండు భాగాలకు ప్రభాస్ కి హిందీలో వాయిస్ అందించింది అతడే. అతడి గంభీరమైన గళం ప్రభాస్ కి బాగా సెట్ అయింది. బాహుబలి ఫలితం ఏంటో అందరికి తెలిసిందే. ఇప్పుడు హిందీలో దసరా చిత్రాన్ని నిలబెట్టింది కూడా అతడే. దసరా హిందీ వర్షన్ కోసం నానికి శరద్ కేల్కర్ డబ్బింగ్ అందించారు. నాని రా అండ్ రస్టిక్ పెర్ఫామెన్స్ కి శరద్ కేల్కర్ వాయిస్ బాగా సెట్ అయింది. బాక్సాఫీస్ వద్ద దసరా హంగామా మొదలయింది. ఈ చిత్రంతో నాని తిరుగులేని పాన్ ఇండియా స్టార్ కావడం ఖాయం అనే అంచనాలు వినిపిస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు