ntr: కొడుకు అభయ్‌రామ్‌తో అదిరిపోయే పిక్‌ని షేర్‌ చేసిన ఎన్టీఆర్.. పారిస్‌లో వెకేషన్‌

Published : Nov 21, 2021, 04:26 PM IST
ntr: కొడుకు అభయ్‌రామ్‌తో అదిరిపోయే పిక్‌ని షేర్‌ చేసిన ఎన్టీఆర్.. పారిస్‌లో వెకేషన్‌

సారాంశం

ఎన్టీఆర్ ప్రస్తుతం వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన శనివారం సాయంత్రం తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా తన కుమారుడు అభయ్‌రామ్‌తో దిగిన ఓ అద్భుతమైన ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు.

ఎన్టీఆర్‌(NTR) షార్ట్ వెకేషన్‌కి వెళ్లారు. ఆయన శనివారం సాయంత్రం విదేశాలకు వెళ్లిపోయారు. తన ఫ్యామిలీతో కలిసి ఆయన హాలీడేస్‌ని(NTR Vacation) ఎంజాయ్ చేసేందుకు వెళ్లారు. ఈమేరకు ఎయిర్‌పోర్ట్ లో పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే NTRఎక్కడికి వెళ్తున్నారనేది సస్పెన్స్ గా మారిన నేపథ్యంలో తాజాగా క్లారిటీ ఇచ్చారు ఎన్టీఆర్‌. పారిస్‌కి వెళ్లినట్టు వెల్లడించారు. ఈ మేరకు ఆయన తన పెద్ద కుమారుడు అభయ్‌రామ్‌తో దిగిన ఫోటోని పంచుకున్నారు. ఈఫిల్‌ టవర్‌ బ్యాక్‌డ్రాప్‌లో కుమారుడికి ప్రేమతో ముద్దు పెడుతున్న పిక్‌ని ఎన్టీఆర్ ఇన్‌స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది. 

ఎన్టీఆర్‌.. ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Movie) చిత్రంలో నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంతో ఎన్టీఆర్‌తోపాటు రామ్‌చరణ్‌ మరో హీరోగా నటిస్తున్నారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొనడానికి ముందు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ ఏం చేశారు, ఎలాంటి పోరాటాలు చేశారనే కథాంశంతో ఈ చిత్రాన్ని ఫిక్షనల్‌గా తెరకెక్కిస్తున్నారు జక్కన్న. ఇప్పటికే విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. గూస్‌బంమ్స్ ని తెప్పిస్తుంది. ఈ చిత్రాన్ని జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేయబోతున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్ ని దుబాయ్‌లో ప్లాన్‌ చేసినట్టు తెలుస్తుంది. 

సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌, చరణ్‌కి జోడీగా బాలీవుడ్ నటి అలియాభట్‌ నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌, శ్రియా కీలక పాత్రలు పోసిస్తున్నారు. డివివి దానయ్య దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కించారు. పది భాషల్లో సినిమాని రిలీజ్‌ చేయబోతున్నారు. మరోవైపు ఎన్టీఆర్‌.. కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నారు. ఇది ఎన్టీఆర్‌ వెకేషన్‌ పూర్తి చేసుకుని వచ్చాక షూటింగ్‌ స్టార్ట్ చేయబోతున్నారని టాక్. అయితే దాదాపు నెల రోజులు ఎన్టీఆర్‌ `ఆర్‌ఆర్‌ఆర్` ప్రమోషన్‌కి కేటాయించారట. తెలుగు రాష్టాల్లోనే కాదు, ముంబయి, బెంగుళూరు, చెన్నై, కేరళ వంటి రాష్ట్రాల్లోనూ ప్రమోషన్‌ చేయబోతున్నారట. వీటితోపాటు విదేశీ ప్రమోషన్లలోనూ స్టార్ కాస్టింగ్ పాల్గొనబోతున్నట్టు టాక్‌. 

also read: NTR: వెకేషన్ కి వేళాయెరా.. ఫ్యామిలీ తో విదేశాలకు చెక్కేస్తున్న ఎన్టీఆర్!

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్