Kaikala Satyanarayana: కైకాలను పలకరించారు... తిరిగివచ్చాక సంబరాలు చేసుకుందాం

By team teluguFirst Published Nov 21, 2021, 2:41 PM IST
Highlights


సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ కాగా , డాక్టర్స్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయన పరిస్థితి, అత్యంత విషమంగా ఉన్నట్లు తెలియజేశారు. కాగా కైకాల కోలుకున్నట్లు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. 
 

జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) హెల్త్ కండీషన్ పై డాక్టర్స్ మీడియా బులెటిన్ విడుదల చేయగా, ఆందోళన కలిగించింది. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు డాక్టర్స్ ప్రెస్ నోట్ లో వెల్లడించారు. ఐసీయూలో రెస్పిరేటరీ సిస్టమ్ పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన శరీరంలోని ప్రధాన అవయవాలు విఫలం చెందినట్లు వెల్లడించిన వైద్యులు, కాపాడడం కూడా చాలా కష్టం అన్నట్లు ధృవీకరించారు. 

ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు చిత్ర ప్రముఖులు దిగ్బ్రాంతికి గురయ్యారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన స్పృహలోకి రావడంతో ఆయనను పలకరించానంటూ, చిరంజీవి గుడ్ న్యూస్ పంచుకున్నారు. ట్విట్టర్ వేదికగా కైకాల ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన చిరంజీవి (Chiranjeevi), తన ట్వీట్ లో చాలా సమాచారం పొందుపరిచారు. 

కైకాలకు చికిత్స అందిస్తున్నక్రిటికల్ కేర్ డాక్టర్ సుబ్బారెడ్డితో మాట్లాడినట్లు వెల్లడించారు. ఆయనతో మాట్లాడిన తర్వాత కైకాల కోలుకుంటారనే నమ్మకం పెరిగింది అన్నారు. ట్రాకియాస్టోమి అనే రుగ్మతతో బాధపడుతున్న కైకాల మాట్లాడలేకపోయారని, అయితే ఆయన త్వరగా కోలుకొని తిరిగి రావాలని, అప్పుడు అందరం సంబరాలు చేసుకోవాలని ఆకాంక్షించారు. చిరంజీవి ట్వీట్ తర్వాత కైకాలకు ఏమీ కాదనే ధైర్యం అందరిలో నెలకొంది. చిరంజీవి నటించిన అనేక సినిమాలలో కైకాల విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. 

Also readKaikala Satyanarayana:కైకాలకు రేపుల నారాయణ అనే పేరు ఎందుకు వచ్చింది?

86 ఏళ్ల కైకాల సత్యనారాయణ టాలీవుడ్ మొదటితరం నటుల్లో అగ్రగణ్యుడు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి అగ్రనటులతో వందల కొద్దీ సినిమాలలో కలిసి నటించారు. పౌరాణిక, చారిత్రక, జానపద, సోషల్ ఇలా భిన్నమైన జోనర్స్ లో 700 వందలకు పైగా చిత్రాలలో కైకాల సత్యనారాయణ నటించారు. ఇటీవల ఇంట్లో జారిపడ్డ కైకాల ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నారు. 

Also read Kaikala Satyanarayaana: కైకాల సత్యనారాయణ ఆరోగ్యపరిస్థితిపై హెల్త్ బులెటిన్... కాపాడడం చాలా కష్టం!
 

pic.twitter.com/Log3ohKtnz

— Chiranjeevi Konidela (@KChiruTweets)
click me!