
తెలుగు బుల్లితెరపై ఇప్పటి వరకు స్టార్ హీరోల సందడి పీక్స్ కు వెళ్తోంది. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున హోస్ట్ లుగా వ్యవహరించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకి మంచి క్రేజ్ రావటంతో.. ఇప్పటి వరకు బుల్లితెర అంటే అదో చిన్న విషయం అని అపోహ పడ్డ స్టార్ హీరోలంతా క్యూ కడుతున్నారు. ఈ మద్య ఇండస్ట్రీ టాప్ హీరోలు కూడా బుల్లితెర ఎంట్రీ ఇవ్వడంతో ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ‘బిగ్ బాస్’ షో ఈ నెల 16న రాబోతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ‘బిగ్‌బాస్’ షోను అధికారికంగా లాంచ్ చేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘‘నాకు ఛాలెంజెస్ అంటే బాగా ఇష్టం. నా చిన్నతనంలో టివి షోస్ చూస్తుండే వాడిని. .అయితే నాకు సరిగా మాట్లాడటం, టీవీలో హోస్ట్ గా ఎలా బిహేవ్ చేయాలని కానీ, ఎలా మాట్లాడాలని కానీ, ఎలా నటించాలని కానీ తెలీదని అన్నారు ఎన్టీఆర్. అయితే స్టార్ మా బిగ్‌బాస్ షోను హోస్ట్ చేయమని చెప్పి నా దగ్గరకు వచ్చిందో.. రెండో నిమిషం కూడా ఆలోచించలేదు. ఇదో ఛాలెంజ్ గా తీసుకుని.. నేను ఈ షో చేస్తున్నా అన్నారు.
ఇండస్ట్రీలో నటించడం ఒకఎత్తైతే బుల్లితెరపై నటించడం మరో ఎత్తు. ఇప్పటికే సీనియర్ హీరోలు హోస్ట్ గా వ్యవహరించారు. వారు ఎలా బుల్లి తెర ప్రేక్షకులను మెప్పించారన్న విషయం స్టడీ చేయాల్సి ఉందని అంటున్నారు. మీకు ఇన్సిపిరేషన్ ఎవరన్న ప్రశ్నకు నాకు ఇప్పుడు..ఎప్పుడూ మా తాతగారే ఆదర్శం అని అన్నారు.
బిగ్‌బాస్ షోను హోస్ట్ చేయమని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించిందని.. ఐ లైక్ ఛాలెంజింగ్ మై సెల్ఫ్. సో బిగ్‌బాస్‌కు హోస్ట్ గా చేయడం మరో ఛాలెంజ్. ఆ ఛాలెంజ్‌ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు ఎన్టీఆర్. భారతదేశంలో ఇంత పెద్ద రియాలిటీ షోకు తెలుగులో నన్ను హోస్ట్ గా తీసుకున్న స్టార్ మా ఛానల్ కు ధన్యవాదాలు.’’ అన్నారు. కార్యక్రమంలో బిగ్ బాస్ షోకు సంబంధించిన మరో స్టన్నింగ్ ప్రోమో విడుదల చేశారు.