
టాలీవుడ్ వెండితెర మీద ఓ శృంగార దేవతగా ఓ వెలుగు వెలిగిన ఇలియానా... బాలీవుడ్ అవకాశాల కోసం అటువైపు వెళ్లింది. ఇక్కడ నిత్యం నాలుగైదు సినిమాలతో సందడి చేస్తున్న టైమ్ లో ఇలియానా బాలీవుడ్‌కు తరలిపోయింది. హిందీ పరిశ్రమలో ఒకట్రెండు సినిమాల్లో బాగానే మెరిసింది. అయితే హిందీలో ఏక్ సే ఏక్ హీరోయిన్లు ఉండటంతో అనుకున్నంతగా ఇలియానా రాణించలేకపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో అడపాదడపా కనిపిస్తోంది. అంతకన్నా మించి సోషల్ మీడియాలో ఇలియానా తన ప్రస్తుత ప్రియుడు, ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్‌తో డేటింగ్ చేస్తున్న అంశాలతో హల్ చల్ చేస్తోంది.
ఇక అసలు విషయం ఏంటంటే.. దశాబ్దకాలానికి పైగా తెలుగు పరిశ్రమలో టాప్ రేసులో నిలిచిన ఇలియానా అప్పట్లో కొన్నేళ్లపాటు ఓ తెలుగు హీరోతో డేటింగ్ చేశానని వెల్లడించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. “అప్పట్లో ఆరోగ్యం మెరుగ్గా ఉండేందుకు ఓ టాలీవుడ్ హీరోతో డేటింగ్ చేశాను. నాకు యవ్వనంలో హార్మోన్ల సమస్య తలెత్తింది. దాంతో ఓ తెలుగు హీరోతో అఫైర్ కొనసాగించాను. మా ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడంతో విడిపోయాను” అని గోవా సుందరి ఇటీవల మీడియాకు చెప్పేసింది. అయితే ఆ హీరో పేరు చెప్పడానికి నిరాకరించింది.
ఇక అవకాశాల కోసం కాస్టింగ్ కౌచ్ వ్యవహారానికి లొంగడం అనేది హీరోయిన్ల మనస్తత్వంపై ఆధారపడి ఉంటుంది. తమ టాలెంట్‌పై నమ్మకం ఉన్నవారు అలాంటి వాటికి లొంగరు. ప్రతిభ ఉంటే మనవెంటనే పడుతారు. ఆ వ్యవహారం మన మనస్తత్వంపైనే ఆధారపడి ఉంటుంది అని ఇలియానా వెల్లడించింది.
15 ఏళ్ల వయసులోనే ఓ తెలుగు దేవదాస్ చిత్రంలోకి తీసుకొన్నారు. అమెరికాకు వెళ్లడానికి అవకాశం ఉండటంతో నేను కూడా ఒప్పుకొన్నాను. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగానే తెలుగు హీరోతో డేటింగ్ చేయాల్సి వచ్చింది. నా ఇష్టపూర్వకంగానే అది జరిగింది. దానిని క్యాస్టింగ్ కౌచ్ అనుకోవద్దు అని ఇలియానా చెప్పింది.ప్రస్థుతం ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ అండ్రూ నీబోన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిన ఇలియానా ప్రస్తుతం విదేశాలను చుట్టివస్తున్నది. పలు దేశాల్లో పర్యటిస్తూ సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేసి వేడి పుట్టిస్తున్నది. బాలీవుడ్ అవకాశాల కోసం హైదరాబాద్ నుంచి దుకాణం ఎత్తేసిన ఇలియానా గోవా టు ముంబై మధ్య చక్కర్లు కొడుతోంది.
అర్జున్ కపూర్‌తో బాలీవుడ్‌లో ప్రస్తుతం ముబాకరన్ చిత్రంతోపాటు, అజయ్ దేవ్గన్ సరసన బాద్షాహో అనే చిత్రాల్లో నటిస్తోంది. అర్జున్ కపూర్ హీరోగా నటిస్తున్న ముబాకరన్ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోందు. ఈ చిత్రాలపైనే బోలెడు ఆశలు పెట్టుకుంది ఇల్లీ బేబి.