'అరవింద సమేత'కు అతి తక్కువ టీఆర్పీ,కారణం ఇదేనా?

By Udayavani DhuliFirst Published Jan 24, 2019, 3:44 PM IST
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమా బాక్సాఫీసు వద్ద బాగానే వర్కువుట్ అయ్యింది. దసరా సెలవులు కావడం, పైగా కొత్త సినిమాలు ఏవి లేకపోవడంతో ఈ సినిమా కలెక్షన్స్ కు బాగా కలిసొచ్చింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమా బాక్సాఫీసు వద్ద బాగానే వర్కువుట్ అయ్యింది.    దసరా సెలవులు కావడం, పైగా కొత్త సినిమాలు ఏవి లేకపోవడంతో ఈ సినిమా  కలెక్షన్స్ కు బాగా కలిసొచ్చింది.  ఎన్టీఆర్ నటన, త్రివిక్రమ్ డైరెక్షన్.. అన్నింటికీ మించి సినిమాకు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ కారణంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.  ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది.

అయితే  ఈ చిత్రం బుల్లితెరపై మాత్రం అనుకున్నంత రెస్పాన్స్‌ను సాధించలేకపోయింది. తెలుగులో  ప్రముఖ ఛానల్‌ జీ తెలుగులో ప్రసారమైన ఈ చిత్రం 13.7 రేటింగ్‌ను మాత్రమే సాధించగలిగింది. ఎన్టీఆర్ సినిమాల పరంగా చూస్తే ఇది చాలా తక్కువ రేటింగ్‌ను సాధించినట్లే.  

విజయదేవరకొండ గీతా గోవిందం చిత్రం మొదటి సారి 20.51 రెండో సారి 17 టీఆర్పీ రేటింగ్ లు సాధించింది. రెండో సారి ప్రసారమైన గీతా గోవిందం కన్నా తక్కువ రేటింగ్ రావటం తో ఈ విషయం హైలెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నాయి. 

ఈ మధ్యకాలంలో స్టార్ హీరో సినిమాల టీఆర్పీలకు సైతం అమెజాన్ ప్రైమ్ దెబ్బ తగులుతోంది.  అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా  ముందే ప్రసారమవ్వుతున్నాయి. అయితే అరవింద సమేత చిత్రం ఇంకా ఏ డిజిటల్ ప్లాట్ ఫాం లోనూ ప్రసారం కాలేదు.  ఈ సినిమాకు హింసతో నిండి ఉండటమే ఫ్యామిలీలు ఎక్కువ చూసే టీవిల్లో రేటింగ్ రాకపోవటానికి కారణం కావచ్చు అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. 

అత్యధిక TRP రేటింగ్ అందుకున్న తెలుగు మూవీస్! (TOP 15)

click me!