పవన్ - తారక్ క్రేజ్.. టీవీల్లో తగ్గించిన త్రివిక్రమ్!

By Prashanth MFirst Published Jan 24, 2019, 3:42 PM IST
Highlights

త్రివిక్రమ్ మొదటి నుంచి దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలు బుల్లితెరపై మంచి TRPని అందుకున్నాయి. ప్లాప్ అయిన ఖలేజా కూడా టీవీల్లో వస్తే ఛానల్ మారదు. జనాలు అంతగా ఇష్టపడే త్రివిక్రమ్ సినిమాలు ఈ మధ్య నీరాశపరుస్తున్నాయి. 

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పెన్ను పవర్ తగ్గిపోతుందా అనే సందేహం కలుగుతోంది. త్రివిక్రమ్ మొదటి నుంచి దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలు బుల్లితెరపై మంచి TRPని అందుకున్నాయి. ప్లాప్ అయిన ఖలేజా కూడా టీవీల్లో వస్తే ఛానల్ మారదు. జనాలు అంతగా ఇష్టపడే త్రివిక్రమ్ సినిమాలు ఈ మధ్య నీరాశపరుస్తున్నాయి. 

ముఖ్యంగా పవన్ అజ్ఞాతవాసి ఏ స్థాయిలో ఫెయిల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక చివరగా ఎన్టీఆర్ తో చేసిన అరవింద సమేత వీర రాఘవ కూడా బుల్లి తెరలో పెద్దగా రికార్డ్ ఏమి సాధించలేదు.అయితే ఆ సినిమా రిలీజ్ అప్పుడే అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది.  అరవిందను రీసెంట్ గా జీ తెలుగు ఛానెల్ సంక్రాంతిలో ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. సినిమాకు 13.7టిఆర్పి మాత్రమే వచ్చింది. 

ఇక అజ్ఞాతవాసికి మొదటి టివి ప్రీమియర్ కు కనీసం 7 రేటింగ్ కూడా రాలేదు. త్రివిక్రమ్ - పవన్ కాంబోలో వచ్చిన గత చిత్రం అత్తారింటికి దారేది సినిమాకు 19.84 TRP వచ్చింది. ఇక ఎన్టీఆర్ కెరీర్ లో అత్యధిక TRPని అందుకున్న చిత్రంగా  టెంపర్ 23.50తో టాప్ 2 లో ఉంది. పవన్ - తారక్ ల సినిమాలకు ఈ మధ్య కాలంలో అతి తక్కువ TRP వచ్చిన చిత్రాలుగా ఈ రెండు సినిమాలు నిలిచాయి. 

రీసెంట్ గా వచ్చిన గీత గోవిందం వారం గ్యాప్ లో టీవీలో ప్రీమియర్స్ రాగా 20,17 రేటింగ్స్ తో న్యూ రికార్డ్ ను సెట్ చేసింది.  

అత్యధిక TRP రేటింగ్ అందుకున్న తెలుగు మూవీస్! (TOP 15)

click me!