వీడియో: బుల్లితెరపై బిగ్ బ్యాంగ్.. చరణ్, ఎన్టీఆర్ ఒకేసారి ఎంట్రీ!

pratap reddy   | Asianet News
Published : Aug 15, 2021, 06:06 PM IST
వీడియో: బుల్లితెరపై బిగ్ బ్యాంగ్.. చరణ్, ఎన్టీఆర్ ఒకేసారి ఎంట్రీ!

సారాంశం

బుల్లితెరపై విస్ఫోటనం లాంటి షోకి రంగం సిద్ధం అయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే.

బుల్లితెరపై విస్ఫోటనం లాంటి షోకి రంగం సిద్ధం అయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఓ ప్రముఖ ఛానల్ ఈ షోని టెలికాస్ట్ చేయనుంది. బిగ్ బి అమితాబ్ కౌన్ బనేగా కరోడ్ పతి తరహాలో ఈ షోని నిర్వహించనున్నారు. 

చివరి ఘట్టం వరకు చేరుకునే పోటీదారులు రూ కోటి నగదు గెలుచుకోనున్నారు. ఇదిలా ఉండగా ఈ షో తొలి ఎపిసోడ్ ఆగష్టు 2న ప్రసారం కానుంది. ప్రారంభ ఎపిసోడ్ ని గ్రాండ్ లెవల్ లో ప్లాన్ చేశారు. ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే మెగా పవర్ స్టార్ రాంచరణ్ తొలి ఎపిసోడ్ కి గెస్ట్ గా హాజరు కాబోతున్నారు. 

తాజాగా నిర్వాహకులు తొలి ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు. రాంచరణ్, ఎన్టీఆర్ కలసి ఎంట్రీ ఇస్తున్న ఈ ప్రోమో ఆకట్టుకుంటోంది. ఇద్దరు బడా హీరోలు ఒకసారి బుల్లితెరపై కనిపిస్తే అది విస్ఫోటనమే అవుతుంది. ఎవరు మీలో కోటీశ్వరులు ప్రారంభ ఎపిసోడ్ కి రికార్డ్ స్థాయిలో టీఆర్పీ నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. 

చరణ్, ఎన్టీఆర్ మధ్య సరదా సంభాషణలతో ప్రోమో ఆసక్తికరంగా ఉంది. ఎన్టీఆర్.. రాంచరణ్ కి ఏది హోస్ట్ సీట్, ఏది హాట్ సీటో వివరిస్తున్నాడు. ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నకు సమాధానం కోసం రాంచరణ్ దీర్ఘంగా ఆలోచనలో మునిగిపోయాడు. తొలి ఎపిసోడ్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు. 

రాంచరణ్, ఎన్టీఆర్ కలసి ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాంచరణ్ అల్లూరి పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. 

 

PREV
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి