భీమ్లా నాయక్: పవన్ మాస్ ఎంట్రీకి కుదేలవుతున్న రికార్డ్స్

pratap reddy   | Asianet News
Published : Aug 15, 2021, 01:56 PM IST
భీమ్లా నాయక్: పవన్ మాస్ ఎంట్రీకి కుదేలవుతున్న రికార్డ్స్

సారాంశం

టీజర్ లో పవన్ కళ్యాణ్ మాస్ ఎంట్రీ ఫ్యాన్స్ కేరింతలు కొట్టే విధంగా ఉంది.  పవన్ ట్రేడ్ మార్క్ స్టైల్, పవర్ ఫుల్ వాయిస్ బేస్, తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ టీజర్ ని నెక్స్ట్ లెవల్ కు చేర్చాయి. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి ఇంతవరకు టైటిలే ఫిక్స్ కాలేదనే అసంతృప్తి అభిమానుల్లో ఉండేది. ఇండిపెండ్స్ డే సందర్భంగా అభిమానుల ముచ్చట తీర్చుతూ చిత్ర యూనిట్ హై ఓల్టేజ్ స్టఫ్ అందించింది. 

టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి పవన్ పాత్ర పేరు భీమ్లా నాయక్ అనే టైటిల్ నే ఫిక్స్ చేశారు. టీజర్ లో పవన్ కళ్యాణ్ మాస్ ఎంట్రీ ఫ్యాన్స్ కేరింతలు కొట్టే విధంగా ఉంది.  పవన్ ట్రేడ్ మార్క్ స్టైల్, పవర్ ఫుల్ వాయిస్ బేస్, తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ టీజర్ ని నెక్స్ట్ లెవల్ కు చేర్చాయి. 

ఈ టీజర్ సినిమాపై అమాంతం అంచనాలు పెంచేస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా టీజర్ లో పవన్ మాస్ ఎంట్రీకి యూట్యూబ్ రికార్డులు కుదేలవుతున్నాయి. అతి తక్కువ సమయంలో భీమ్లా నాయక్ టీజర్ 4 లక్షల లైకులు సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించింది. 

ఈ చిత్రంలో రానా పాత్ర పేరుని కూడా టీజర్ లో రివీల్ చేశారు. రానా డానియల్ శేఖర్ గా నటిస్తున్నాడు. మలయాళంలో ఘనవిజయం సాధించిన అయ్యప్పన్ కోషియం చిత్రానికి ఇది రీమేక్. సాగర్ చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా