రియల్‌ హీరో సోనూ సూద్‌కి అరుదైన అవార్డు..

Published : Aug 15, 2021, 02:26 PM IST
రియల్‌ హీరో సోనూ సూద్‌కి అరుదైన అవార్డు..

సారాంశం

సోనూ సూద్‌ చేస్తున్న సేవలను గుర్తించిన పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌.. నటుడు సోనూసూద్‌కి సోషల్‌ వెల్ఫేర్‌ అవార్డుని ఇస్తున్నట్టు ప్రకటించింది. దీంతో సోనూసూద్‌కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

రియల్‌ హీరోగా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్‌ని పంజాబ్‌ ప్రభుత్వం  గౌరవించింది. అరుదైన అవార్డుని ప్రకటించింది. సోనూ సూద్‌ చేస్తున్న సేవలను గుర్తించిన పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌.. నటుడు సోనూసూద్‌కి సోషల్‌ వెల్ఫేర్‌ అవార్డుని ఇస్తున్నట్టు ప్రకటించింది. సోనూసూద్‌తోపాటు యంగేస్ట్ సర్చంచ్‌గా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్ ల్లోకి ఎక్కిన కరణ్‌ గిల్హోత్రాని సైతం అదే అవార్డుతో సత్కరించింది. కరణ్‌ గిల్హోత్రా ఈ అవార్డుని ఆదివారం ఇండిపెండెన్స్ డే సందర్భంగా సీఎం చేతుల మీదుగా అందుకున్నారు.

దీంతో సోనూసూద్‌కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా సమయంలో ఆపదలో ఉన్న వారికి, వలసకార్మికులకు అండగా నిలిచారు సోనూసూద్‌. వారికి షెల్టర్‌ ఏర్పాటు చేయడంతోపాటు భోజనాలు ఏర్పాటు చేశారు. అనంతరం సురక్షితంగా వారిని స్వస్థలాలకు  ప్రత్యేకంగా బస్సులు, ట్రైన్ల ద్వారా పంపించారు. అనంతరం తన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉన్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌లో టైమ్‌లో కరోనా రోగులకు బెడ్స్, ఆక్సిజన్‌ బెడ్స్, వెంటిలేటర్స్ , రెమిడెసివర్స్ ఇంజిక్షన్లు అందిస్తూ తన సేవని మరింతగా విస్తరించారు.

మరోవైపు దేశంలో కొన్ని చోట్ల ఏకంగా ఆక్సిజన్‌ ప్లాంట్లని ఏర్పాటు చేశారు. అంతేకాదు మున్ముందు ఫ్రీగా వైద్యం, విద్య అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతోపాటు నటుడిగానూ నటిస్తూ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే