
తాజాగా ఈ సినిమా టైటిల్కు సంబంధించిన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. నిర్మాత కళ్యాణ్ రామ్ ఫిలిం చాంబర్లో 'జై లవకుశ' అనే టైటిల్ను రిజిస్టర్ చేయించాడు. ఈ టైటిల్ ఎన్టీఆర్ సినిమా కోసమే అన్న టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ మూడు పాత్రలో నటిస్తుండటం.. టైటిల్లో జై, లవ, కుశ అనే మూడు పేర్లు కనిపిస్తుండటంతో ఇదే ఎన్టీఆర్ కొత్త సినిమా టైటిల్ అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. మరి త్వరలోనే యూనిట్ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.