వినాయక చవితి పండుగ రోజున కుశ లుక్ తో ఎన్టీఆర్ సర్ప్రైజ్

Published : Aug 25, 2017, 09:33 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
వినాయక చవితి పండుగ రోజున కుశ లుక్ తో ఎన్టీఆర్ సర్ప్రైజ్

సారాంశం

వినాయక చవితికి ఒక రోజు ముందే లవ టీజర్ తో వచ్చేసిన ఎన్టీఆర్ పండుగ రోజున కుశ లుక్ తో ఎన్టీఆర్ సర్ప్రైజ్ బాబీ దర్శకత్వంలో వస్తోన్న ఎన్టీఆర్ జై లవకుశ స్పీడు పెంచింది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్లో  నిర్మిస్తున్న జై లవకుశ స్పీడు పెంచింది. వినాయక చవితికి ఒక రోజు ముందుగానే లవ టీజర్తో ఆకట్టుకున్న ఎన్టీఆర్. వినాయక చవితి రోజు మరో సర్ ప్రైజ్ ఇచ్చాడు. యంగ్ టైగర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తుండగా ఇప్పటికే జై, లవ పాత్రలకు సంబంధించిన లుక్స్ టీజర్స్ బయటకు వచ్చేశాయి.



తాజాగా మూడో పాత్ర కుశ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఈ లుక్ లో ఎన్టీఆర్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ట్రెండీగా కనిపిస్తున్నాడు. ఈ నెలాఖరున కుశ టీజర్ ను కూడా రిలీజ్ చేసి సెప్టెంబర్ 3న అభిమానుల సమక్షంలో ఆడియో రిలీజ్ ను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్లు.

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్