ఆకు చాటు పిందె తడిసె.. వర్షంలో బాలకృష్ణ - రకుల్ రొమాన్స్!

Published : Oct 10, 2018, 06:07 PM ISTUpdated : Oct 10, 2018, 07:09 PM IST
ఆకు చాటు పిందె తడిసె.. వర్షంలో బాలకృష్ణ - రకుల్ రొమాన్స్!

సారాంశం

టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో ఎన్టీఆర్ బయోపిక్ ఒకటి. ఎన్టీఆర్ బాల్యం నుంచి సినీ ప్రస్థానం, రాజకీయ వ్యవహారాలు వంటి విషయాలను సినిమాలో చూపించనున్నారు. 

టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో ఎన్టీఆర్ బయోపిక్ ఒకటి. ఎన్టీఆర్ బాల్యం నుంచి సినీ ప్రస్థానం, రాజకీయ వ్యవహారాలు వంటి విషయాలను సినిమాలో చూపించనున్నారు. అదే విధంగా సినిమాలో ఎన్టీఆర్ సినిమా కెరీర్ కి సంబందించి కొన్ని సినిమాలను ప్రస్తావించనున్నారు. 

బాలకృష్ణ కొన్ని స్పెషల్ లుక్స్ కోసం ఎంతగానో కష్టపడుతున్నారు. రీసెంట్ గా వేటగాడు సినిమాకు సంబందించిన కొన్ని సన్నివేశాలను షూట్ చేశారు. ట్రెండ్ సెట్ చేసిన ఆకు చాటు పిందె తడిసె సాంగ్ ని కూడా చిత్రీకరించారు. కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. 

శ్రీదేవి పాత్రలో రకుల్ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఫోటోలలో బాలకృష్ణ - రకుల్ ప్రీత్ అచ్చం ఎన్టీఆర్ - శ్రీదేవి పాత్రల్లో కనిపించడం ఆకట్టుకుంటోంది. వర్షంలో ఆకు చాటు పిందె తడిచే అంటూ ఇద్దరు స్టెప్పులు వెయ్యడం ఎలా ఉంటుందా అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!
Illu Illalu Pillalu Today Episode Dec 10: అమూల్యకు విశ్వ ఉత్తరం.. నర్మద, ప్రేమ చేతికి చేరిన లెటర్