NTR30: ఎన్టీఆర్ విషయంలో ఊపిరి పీల్చుకున్న కొరటాల శివ, ఇక రెగ్యూలర్ షూటింగ్ ఎప్పుడంటే..?

By Mahesh JujjuriFirst Published Oct 12, 2022, 1:57 PM IST
Highlights

ఎట్టకేలకు కొరటాల శివ ఊపిరిపీల్చుకున్నాడు. ఎన్టీఆర్ తో సినిమా విషయంలో చాలా కాలంగా మధన పడుతున్నకొరటాలకు తారక్ గుడ్ న్యూస్ చెప్పినట్టు తెలుస్తోంది. 

ఆచార్య  సినిమా డిజాస్టర్ అవ్వడంతో .. కొరటాల బాగా డల్ అయ్యారు. వరుస హిట్లు కొడుతూ వస్తున్న కొరటాలకు ప్లాప్ పడటం.. అది కూడా మెగా  ఫ్లాప్ అవ్వడంతో ఆయన ఫ్యాన్స్ కు టార్గెట్ అయ్యారు. దాంతో అంతకు ముందు అనుకున్న ఎన్టీఆర్ ప్రాజెక్ట్ మీద ఈ ప్రభావం పడుతుందని  కొరటాల శివ చాలా బయపడ్డాడు. కానీ తారక్ ఆ విషయంలో అభయం ఇవ్వడంతో... ఎన్టీఆర్ సినిమా విషయంలో కొంత సమయం తీసుకున్నాడు శివ. ఆచార్య ప్లాప్ అవ్వడం.. అదే టైమ్ లో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా  స్టార్ గా మారడంతో.. కొరటాల మీద ప్రెజర్ ఇంకా పెరిగింది.

ఇక ఎన్టీఆర్ 30వ సినిమాకి సంబంధించిన కథ విషయంలో కొరటాల మరింత కసరత్తు చేస్తున్నాడంటూ న్యూస్ గత కొద్ది కాలంగా చక్కర్లు కొట్టింది.  ఎన్టీఆర్ ఇమేజ్ కు తగ్గట్టు.. పాన్ ఇండియా రేంజ్ లో ఈసినిమా ఆడేట్టు.. కథను మార్చుకున్నాడట కొరటాల. అంత కాదు తారక్ కూడా ఈ కథను ఫైనల్ చేయడం.. తను ఆశించినట్టుగా స్క్రిప్ట్ వచ్చిందని ఎన్టీఆర్ సంతృప్తిని వ్యక్తం చేయడంతో కొరటాల శివ ఊపిరి పీల్చుకున్నట్టు తెలుస్తోంది. 

ఇక ఎన్టీఆర్ సై అనడంతో.. సెట్స్ పైకి వెళ్లడానికి కొరటాల సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. అంతే కాదు నవంబర్ 12 నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది.అనిరుధ్ సంగీతం  సమకూర్చుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందంటూ.. వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఈసినిమాలో ఓ కీలకపాత్రకోసం తమిళ స్టార్ హీరో విక్రమ్ కనిపించనున్నాడని అంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.

click me!