
చిరంజీవి గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా యూఎస్ లో వసూళ్లు వర్షం కురిపిస్తుంది. అక్కడ $ 1 మిలియన్ మార్క్ దాటేసింది. కెరీర్లో మొదటిసారి చిరంజీవి అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ చేశారు. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా కంటెంట్ పై నమ్మకంతో గాడ్ ఫాదర్ చిత్రం చేశారు. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించగా సత్యదేవ్, నయనతార కీలక రోల్స్ చేశారు. మలయాళ చిత్రం లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కింది.
గాడ్ ఫాదర్ సక్సెస్ నేపథ్యంలో చిరంజీవి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి మాట్లాడుతూ... రిమేక్స్ చేయడం నిజంగా ఛాలెంజ్.ఎందుకంటే ప్రేక్షకులు ఆల్రెడీ ఒరిజినల్ మూవీ చూసి ఉంటారు. పోలికలు వస్తాయి. గతంలో కూడా నేను రీమేక్స్ చేశాను. లూసిఫర్ చేయడానికి కేవలం రామ్ చరణ్ కారణం. తనే ఈ సినిమా చేయాలని సూచించాడు. ఇక నా వరకు భార్య సురేఖ పెద్ద క్రిటిక్. ఆమె అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను.
గాడ్ ఫాదర్ మూవీలో నా పాత్రకు డాన్సులు, కామెడీ డైలాగ్స్ లాంటివి ఉండవు. కమర్షియల్ ఎలిమెంట్స్ లేని సీరియస్ క్యారెక్టర్. ప్రజెంట్ సౌత్ ఇండియా మూవీస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయన్నది ఎంత నిజమో, కొన్ని చిత్రాలు ఆడటం లేదన్నది కూడా అంతే నిజం. అదే సమయంలో బాలీవుడ్ చిత్రాలన్నీ ఫెయిల్ అవుతున్నాయన్నది నిజం కాదు. సినిమా ఏ ప్రాంతానిది అన్నది ముఖ్యం కాదు. కంటెంట్ ముఖ్యం. కంటెంట్ మాత్రమే ఆడియన్స్ ని థియేటర్స్ కి తీసుకురాగలదు. కాబట్టి ప్రాంతీయ సినిమా అనే ట్యాగ్ మనం వదిలేయాలి. ఇండియన్ సినిమా అని పలకాలి అన్నారు.
కాగా చిరంజీవి హీరోగా మరో రెండు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. మెహర్ రమేష్ దర్శకుడిగా భోళా శంకర్, బాబీ దర్శకత్వంలో మెగా 154 చేస్తున్నారు. మెగా 154 చిత్ర టీజర్ దీపావళికి రానున్నట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే మూవీ 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తారట.