వచ్చేనెల 21న థియేటర్లలోకి వ‌స్తున్న జై లవకుశ

Published : Aug 23, 2017, 08:18 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
వచ్చేనెల 21న థియేటర్లలోకి వ‌స్తున్న జై లవకుశ

సారాంశం

3 డిఫరెంట్ గెటప్స్ లో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా జై ల‌వ‌కుశ‌ సెప్టెంబ‌ర్ 21న జై ల‌వ‌కుశ సినిమా విడుద‌ల చవితి కానుకగా ఎన్టీఆర్ మూవీ టీజ‌ర్ విడుద‌ల

 

 నెల రోజుల్లో ‘జై లవకుశ’ సినిమా థియేటర్లలోకి రానుంది. 3 డిఫరెంట్ గెటప్స్ లో ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమా. మొన్నటివరకు పూణెలో షూటింగ్ జరుపుకుంది. తాజాగా ఆ షెడ్యూల్ కంప్లీట్ అయింది. దీంతో 3 పాటలు మినహా టోటల్ టాకీ పూర్తయింది. అంతేకాదు, ఈ మూవీకి సంబంధించి ఇవాళ్టి నుంచి డబ్బింగ్ కూడా ప్రారంభించాడు ఎన్టీఆర్.

 

మిగిలిన 3 పాటల్లో 2 పాటల్ని విదేశాల్లో షూట్ చేయాలనేది ప్లాన్. కాకపోతే బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్.. ఫారిన్ లో షూటింగ్ పెట్టుకునే పొజిషన్ లో లేడు. పైగా రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండడంతో.. విదేశాల్లో షూటింగ్ పెట్టుకునేకంటే ఇండియాలోనే పాటల షూటింగ్ కంప్లీట్ చేయాలని నిర్ణయించారు.

 

ఇండియాలోనే అందమైన లొకేషన్లలో 2 పాటల్ని పూర్తిచేసి, మిగిలిన ఒక్క పాటను సెట్ లో కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారు. వినాయక చవితి కానుకగా ఎల్లుండి సాయంత్రం 5గంటల 40నిమిషాలకు లవకుమార్ టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ఆ వెంటనే వారం గ్యాప్ లో కుశాల్ టీజర్, ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేస్తారు. సినిమాను వచ్చేనెల 21న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

PREV
click me!

Recommended Stories

జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది