ప్ర‌భాస్ మూవీలో ఫ్లాప్ ఆర్టిస్ట్

Published : Aug 23, 2017, 08:09 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
ప్ర‌భాస్ మూవీలో ఫ్లాప్ ఆర్టిస్ట్

సారాంశం

బాలీవుడ్ లో సీనియ‌ర్ న‌టుడు  జాకీ ష్రాఫ్ బాలీవుడ్ లో బాగానే ఉన్న టాలీవుడ్ లో అత‌డిది హైర‌న్ లెగ్ నే తాజాగా ప్ర‌భాస్ సొహో మూవీలో న‌టిస్తున్న జాకీ ష్రాఫ్

ప్రభాస్ సినిమాలో తను నటిస్తున్న విషయాన్ని జాకీ ష్రాఫ్ ధ్రువీకరించాడు. ప్రభాస్ తనకు మంచి అవకాశం ఇచ్చాడని ఈ సీనియర్ బాలీవుడ్ నటుడు చెప్పాడు. ఒకవేళ జాకీ గనుక విలన్ పాత్ర చేస్తూ ఉంటే.. ప్రభాస్ కు ఆపోజిట్ గా ఆయన బాగానే ఉంటాడు. ఒడ్డూ పొడుగు బాగా మ్యాచ్ అవుతుంది. ఫిజిక్కు, పర్సనాలిటీ సెట్ అవుతుంది.

కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. జాకీ సౌత్ సినిమాల్లో నటించడం కొత్త కాదు, అందునా తెలుగు సినిమాల్లో నటించడమూ కొత్త కాదు. 80లలోనే ఏవో రజనీకాంత్ సినిమాల్లో జాకీ నటించాడు. కాస్తంత ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో కనిపించాడు. ఇక తెలుగులో మాత్రం కాస్తంత లేటుగా నటించాడు. జాకీ తొలి సారి తెలుగులో డైరెక్టుగా కనిపించిన సినిమా ‘అస్త్రం’. హిందీలో ఆమిర్ ఖాన్ నటించిన సర్పరోష్ కు రీమేక్ గా తెలుగులో ఈ సినిమా వచ్చింది.

 

కానీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఒరిజనల్ కు ఏ మాత్రం న్యాయం చేయలేకపోయింది. ఆ తర్వాత జాకీష్రాఫ్ పవన్ కల్యాణ్ సినిమా ‘పంజా’ నటించాడు. ఈ సినిమా ఫలితం ఏమిటో ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. ఇక జాకీ నటించిన మరో తెలుగు కళాఖండం ‘శక్తి’. ఇవి గాక.. ఆ మధ్య ‘బ్యాంక్’ అని తెలుగు, హిందీ సినిమాలో జాకీ నటించాడు. అది ఎప్పుడు వచ్చి వెళ్లిందో చాలా మందికి తెలియదు. జాకీ నిజంగా ప్రతిభావంతమైన నటుడు.

 

అందుకే భారీ సినిమాలు అనదగ్గ ప్రాజెక్టుల్లో ఆయనను నటింపజేశారు. కానీ.. ఆ భారీ సినిమాలు అన్నీ డిజాస్టర్ లుగా నిలిచాయి. మామూలు ఫ్లాఫ్ లు కాదు.. అట్టర్ ఫ్లాఫులు. భారీ అంచనాల మధ్యన వచ్చి.. అంతే భారీ ఫ్లాఫులుగా నిలిచాయి. అయితే ఇలాంటి విషయాలను పట్టించుకోకుండా ‘సాహో’ యూనిట్ జాకీని తీసుకుంది. మరి దీంతో జాకీ లక్ మారిపోతుందేమో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే