బాలీవుడ్ లోనూ అదరగొడుతున్న మహేష్ బాబు

Published : Aug 22, 2017, 08:53 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
బాలీవుడ్ లోనూ అదరగొడుతున్న మహేష్ బాబు

సారాంశం

బాలీవుడ్ లోనూ అదరగొడుతున్న మహేష్ బాబు మహేష్ బాబు స్పైడర్ రైట్స్ 25 కోట్లకు తీసుకున్న ఏఏ ఫిలింస్ తాజాగా భరత్ అను నేను సినిమా బిజినెస్ కూడా అదే రేంజ్ లో

సూపర్ స్టార్ మహేష్ బాబుకు దేశవ్యాప్తంగా వున్న ఫాలోయింగ్ ఏంటో తెలిసిందే. కేవలం తెలుగు సినిమాలే చేసినా ఫాలోయింగ్ విషయంలో మహేష్ కు సాటిలేదు. ఇక మొదటిసారి తమిళ తెలుగు బైలింగ్వల్ మూవీ చేస్తున్న మహేష్ స్పైడర్ తో కోలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్నాడు. మురుగదాస్ ఎలాగు తమిళ దర్శకుడే కాబట్టి అక్కడ ఈ సినిమా పెద్ద రేంజ్ లోనే రిలీజ్ అవుతోంది.

హిందీలో ఏ.ఏ ఫిలిమ్స్ వారు స్పైడర్ సినిమాను 25 కోట్లకు కొనేశారని తెలిసిందే. కేవలం ఓ చిన్న టీజర్ చూసి మహేష్ సినిమాను ఈ రేంజ్ కు కొనడం అంటే మాములు విషయం కాదు. ఇక మహేష్ నుండి రాబోతున్న తర్వాతి సినిమా భరత్ అను నేను కూడా హిందిలో బిజినెస్ అదరగొడుతుంది. ఈ మూవీ రైట్స్ దాదాపు 20 కోట్ల వరకు పలికాయట.

 

శ్రీమంతుడు దర్శకుడు కొరటాల శివతో... మరోసారి సినిమా చేస్తున్న మహేష్ సెట్స్ మీద ఉండగానే ఆ సినిమా బిజినెస్ దుమ్మురేపుతోంది. ఈ సినిమాలో మహేష్ సిఎంగా నటిస్తున్నాడని తెలిసిందే. కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కూడా కొరటాల మార్క్ సినిమాల్లానే సోషల్ మెసేజ్ తో వస్తుందట.

 

స్పైడర్ సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుండగా భరత్ అను నేను 2018 సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా డివివి దానయ్య నిర్మిస్తుండగా సినిమా దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబడుతుందని తెలుస్తుంది.

PREV
click me!

Recommended Stories

Rashmika Mandanna: ఫ్రెండ్స్ తో శ్రీలంక ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక, ఇది బ్యాచిలరేట్ పార్టీనా ?
Director KK Passed Away: నాగార్జున `కేడి` మూవీ డైరెక్టర్‌ కన్నుమూత.. సందీప్‌ రెడ్డి వంగాకి ఈయనే గురువు