విజయ్ దేవరకొండపై ఎన్టీఆర్ ఫాన్స్ ఫైర్!

Published : Sep 22, 2018, 12:49 PM IST
విజయ్ దేవరకొండపై ఎన్టీఆర్ ఫాన్స్ ఫైర్!

సారాంశం

విజయ్ దేరవరకొండ నటించిన 'నోటా' సినిమాకు డేట్ ఫైనల్ చేసే విషయంలో చిత్రబృందం ఎటూ తేల్చుకోలేకపోవడంతో తన సినిమా రిలీజ్ డేట్ ఆడియన్స్ డిసైడ్ చేయాలని అక్టోబర్ 5, 10, 18 డేట్లలో ఒకటిని ఎంపిక చేయాలని పోల్ నిర్వహించాడు విజయ్. 

విజయ్ దేవరకొండ తాజాగా ట్విట్టర్ లో నిర్వహించిన పోల్ ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. విజయ్ దేరవరకొండ నటించిన 'నోటా' సినిమాకు డేట్ ఫైనల్ చేసే విషయంలో చిత్రబృందం ఎటూ తేల్చుకోలేకపోవడంతో తన సినిమా రిలీజ్ డేట్ ఆడియన్స్ డిసైడ్ చేయాలని అక్టోబర్ 5, 10, 18 డేట్లలో ఒకటిని ఎంపిక చేయాలని పోల్ నిర్వహించాడు విజయ్.

అయితే అక్టోబర్ 11న ఎన్టీఆర్ 'అరవింద సమేత' రిలీజ్ కి ఉండడంతో ఏ ధైర్యంతో ఈ పోల్ నిర్వహిస్తున్నావంటూ కామెంట్లు చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. నీకు దమ్ముంటే అక్టోబర్ 10న సినిమా రిలీజ్ చేయమని విజయ్ కి ఛాలెంజ్ విసురుతున్నారు. ఎన్టీఆర్ సినిమా టైమ్ కి వస్తే నీ సినిమా పరిస్థితి దారుణంగా తయారవ్వడం ఖాయమంటూ బెదిరిస్తున్నారు.

మరికొందరు 'నోటా' సినిమా ఫైనల్ కలెక్షన్స్ 'అరవింద సమేత' ఓపెనింగ్స్ వచ్చినన్ని కూడా రావంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విమర్శలపై విజయ్ దేవరకొండ స్పందించకుండా.. ఎక్కువ ఓట్లు పోల్ అయిన అక్టోబర్ 5న రిలీజ్ డేట్ గా ఫిక్స్ అయ్యాడు.

ఈ మేరకు చిత్రబృందం రిలీజ్ డేట్ పోస్టర్ ని కూడా వదిలింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడు. 

 

PREV
click me!

Recommended Stories

నన్ను చూసి ఉలిక్కిపడి చస్తుంటారు, అఖండ 2 బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో బాలకృష్ణ ఆవేశం..6వ హిట్ రాబోతోంది
Illu Illalu Pillalu Today Episode Dec 15: తాగేసి రచ్చ రచ్చ చేసిన వల్లీ, ఇచ్చిపడేసిన ప్రేమ