కౌశల్ విషయంలో నాని.. ఆహీరోని ఫాలో అవుతాడా..?

By Udayavani DhuliFirst Published Sep 22, 2018, 12:21 PM IST
Highlights

బిగ్ బాస్ సీజన్2 మరికొద్దీ రోజుల్లో ముగియనుంది. ప్రస్తుతం బిగ్ బాస్ 2 పైనే అందరి దృష్టి. ఈ వారం మొత్తం హౌస్ లో గొడవలు పడుతూనే ఉన్నారు హౌస్ మేట్స్. కౌశల్ పై హౌస్ మేట్స్ అందరూ మూకుమ్మడిగా దాడి చేసిన సంగతి తెలిసిందే. మొదటిరోజు సహనంగా సమాధానాలు చెప్పిన కౌశల్ రెండో రోజు మాత్రం నోరుజారాడు.

మరి ఈ విషయాలపై హోస్ట్ నాని ఎలా స్పందిస్తాడనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హిందీ బిగ్ బాస్ షోలో కూడా హోస్ట్ సల్మాన్ ఖాన్ కి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అప్పట్లో కంటెస్టెంట్ గా ఉన్న గౌతమ్ గులాటీని మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ ఒక్కటై అతడిని వేధించారు.

దీంతో గౌతమ్ వారిపై అభ్యంతరకర కామెంట్స్ చేశాడు. అప్పుడు సల్మాన్ ఖాన్ ఏం చేశాడంటే.. గౌతమ్ వైపు చూస్తూ ఇంతటి మానసిక వేదన అనుభవించినప్పుడు అలాంటి పదాలే వస్తాయని అన్నారు. అంతేకాదు.. గౌతమ్ ని వేధించిన హౌస్ మేట్స్ కి క్లాసులు పీకాడు. దీంతో అప్పటివరకు సల్మాన్ పై ఉన్న నెగెటివిటీ మొత్తం ఒక్కసారిగా పోయింది.

ఇప్పుడు కౌశల్ విషయంలో కూడా నాని అభియోగాలు ఫేస్ చేస్తున్నాడు. అతడు పక్షపాతం చూపిస్తున్నారని మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ నెగెటివిటీకి ఫుల్ స్టాప్ పెట్టే ఛాన్స్ నానికి వచ్చింది. మరి నాని.. సల్మాన్ ని ఫాలో అవుతాడా..? లేదా..? అనేది మరికొద్ది గంటల్లో తెలియనుంది!

click me!
Last Updated Sep 22, 2018, 12:21 PM IST
click me!