గర్భవతినని చెప్పడానికి భయపడ్డా.. నటి కామెంట్స్!

Published : Sep 22, 2018, 12:02 PM IST
గర్భవతినని చెప్పడానికి భయపడ్డా.. నటి కామెంట్స్!

సారాంశం

బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ, కొన్ని షోలకు కూడా హోస్ట్ చేసిన నేహా ధూపియా కొన్ని నెలల కిందట తను ప్రేమించిన అంగద్ బేడీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నేహా గర్భవతి కావడం వలనే అర్జెంట్ గా పెళ్లి చేసుకుందని అప్పట్లో వార్తలు వినిపించాయి.

ఆ సమయంలో ఆమె వార్తలను ఖండించినప్పటికీ వివాహానికి ముందే ఆమె గర్భం దాల్చిందనే విషయం తేలింది. ఆమె ప్రెగ్నెంట్ అయిన నెలలకు అంగద్ ని వివాహం చేసుకుంది. త్వరలోనే తాము బిడ్డకు జన్మనివ్వబోతున్నామంటూ సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది నేహా.

అలానే ముందే ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదనే విషయంపై కూడా ఆమె స్పందించింది. ''నేను గర్భవతిననే విషయాన్ని ముందే చెప్పడానికి నేను భయపడ్డాను. నేను ప్రెగ్నెంట్ అనే విషయం బయటకి తెలిస్తే.. నాకు అవకాశాలు ఇవ్వరేమోనని భయపడ్డాను.

గర్భం దాల్చినా.. నాలుగైదు నెలల వరకు శరీరాకృతిలో ఎలాంటి మార్పులు ఉండవు. నాకు రెస్ట్ తీసుకోవడం పెద్దగా నచ్చదు అందుకే షూటింగ్ లలో పాల్గొన్నాను'' అంటూ చెప్పుకొచ్చింది. 

PREV
click me!

Recommended Stories

భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?
Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం