ఫ్యాన్స్ ని మళ్లీ డిజప్పాయింట్‌ చేస్తున్న ఎన్టీఆర్‌ ?

Published : May 01, 2021, 12:20 PM IST
ఫ్యాన్స్ ని మళ్లీ డిజప్పాయింట్‌ చేస్తున్న ఎన్టీఆర్‌ ?

సారాంశం

ఈ లోపు ఎన్టీఆర్‌ ఆడియెన్స్ ని, తన ఫ్యాన్స్ ని అలరించేందుకు సిద్ధమయ్యారు. `ఎవరు మీలో కోటీశ్వరుడు` రూపంలో ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేయాలని భావించారు. కానీ..

ఎన్టీఆర్‌ వెండితెరపై కనిపించక మూడేళ్లవుతుంది. చివరగా ఆయన `అరవింద సమేత` చిత్రంతో వచ్చారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2018లో విడుదలైంది. ఆ తర్వాత ఎన్టీఆర్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌`లో లాక్‌ అయిపోయారు. గతేడాది ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనాతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 13న రిలీజ్‌కి ప్లాన్‌ చేశారు. ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ కరోనా కారణంగా ఆ టైమ్‌కి కూడా విడుదలవుతుందా? మళ్లీ వాయిదా పడుతుందా? అన్నది సస్పెన్స్ గా మారింది. 

ఇదిలా ఉంటే ఈ లోపు ఎన్టీఆర్‌ ఆడియెన్స్ ని, తన ఫ్యాన్స్ ని అలరించేందుకు సిద్ధమయ్యారు. `ఎవరు మీలో కోటీశ్వరుడు` రూపంలో ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేయాలని భావించారు. జీతెలుగు ఈ షోని ప్లాన్‌ చేసింది. అధికారికంగా ప్రకటించడంతోపాటు మే నెలలో ప్రారంభం కాబోతుందనే ప్రచారం కూడా జరిగింది. ఇప్పటికే పలు ప్రోమోలు, ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపిక కూడా జరుగుతుంది. ఇక సెకండ్‌ వేవ్‌ కరోనాతో థియేటర్లన్నీ మూత పడటంతో టీవీలో `ఎవరు మీలో కోటీశ్వరుడు` షోనైనా చూసి రిలాక్స్ అవ్వాలని ఆడియెన్స్, ఎన్టీఆర్‌ ని అయినా చూడొచ్చని ఆయన ఫ్యాన్స్ ఎన్నో ఆశలతో ఉన్నారు. 

కానీ ఇప్పుడు ఈ షోపై కూడా కరోనా ఎఫెక్ట్ పడిందని తెలుస్తుంది. వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఈ షోని వాయిదా వేయాలని నిర్వహకులు భావిస్తున్నారట. దీంతో ఈ నెలలో షో ప్రారంభం కావడం లేదని, జూన్‌ చివరి వారంలోగానీ, జులైలోగానీ దీన్ని ప్రారంభించాలని యోచిస్తున్నట్టు సమాచారం. దీంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్‌ అవుతున్నట్టు తెలుస్లుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కరోనా ఉధృతి కారణంగా `ఆర్‌ఆర్‌ఆర్‌` షూటింగ్‌ కూడా వాయిదా పడింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ పై ఫోకస్‌ పెట్టారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం
Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌