కరోనాతో టాలీవుడ్‌ యంగ్‌ డైరెక్టర్‌ కన్నుమూత

Published : May 01, 2021, 09:24 AM IST
కరోనాతో టాలీవుడ్‌ యంగ్‌ డైరెక్టర్‌ కన్నుమూత

సారాంశం

కరోనాకి మరో సినీ ప్రముఖుడు బలయ్యారు. టాలీవుడ్‌లో యంగ్‌ డైరెక్టర్‌ కుమార్‌ వట్టి కన్నుమూశారు. ఆయన హీరో శ్రీవిష్ణుతో `మా అబ్బాయి` సినిమాని తెరకెక్కించారు. 

కరోనాకి మరో సినీ ప్రముఖుడు బలయ్యారు. టాలీవుడ్‌లో యంగ్‌ డైరెక్టర్‌ కుమార్‌ వట్టి కన్నుమూశారు. ఆయన హీరో శ్రీవిష్ణుతో `మా అబ్బాయి` సినిమాని తెరకెక్కించారు. కొన్ని రోజుల క్రితం కుమార్‌ వట్టికి కరోనా సోకింది. ఆరోగ్యం కాస్త ఆందోళనకరంగా ఉండటంతో ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచారు. కుమార్‌ వట్టి మరణం టాలీవుడ్‌ని షాక్‌కి గురి చేసింది. కుమార్‌ వట్టిది శ్రీకాకుళం జిల్లాలోని నర్సన పేట. దర్శకుడు పరశురామ్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పనిచేశాడు. 2017లో శ్రీ విష్ణుతో `మా అబ్బాయి` సినిమాని రూపొందించారు. 

ఇదిలా ఉంటే టాలీవుడ్‌లో పలువురు స్టార్స్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. పవన్‌ కళ్యాణ్‌ కరోనాతో ఇంకా పోరాడుతూనే ఉన్నారు. రీసెంట్‌గా అల్లు అర్జున్‌కి కరోనా సోకింది. పూజా హెగ్డే, కళ్యాణ్‌ దేవ్‌ లకు సైతం కరోనాకి గురయ్యారు. దీంతోపాటు బండ్ల గణేష్‌, దిల్‌రాజు, అల్లు అరవింద్‌, త్రివిక్రమ్‌, నివేదా థామస్‌ కరోనా నుంచి కోలుకున్నారు. ఇలానే అనేక మంది కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: శివన్నారాయణతో నిజం చెప్పిన శౌర్య- పారుతో ఆడుకున్న కార్తీక్
Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం