కరోనా రోగుల కోసం.. అంబులెన్స్ డ్రైవర్‌గా మారిన హీరో..

Published : May 01, 2021, 08:58 AM IST
కరోనా రోగుల కోసం.. అంబులెన్స్ డ్రైవర్‌గా మారిన హీరో..

సారాంశం

చాలా మంది తారలు ప్రజలకు బెడ్స్, ఆక్సిజన్‌కి, హెల్ప్ లైన్‌ డిటెయిల్స్ పంచుకుంటూ సహాయపడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కన్నడ నటుడు అర్జున్‌ గౌడ ఏకంగా తానే ప్రత్యక్షంగా సహాయం చేసేందుకు ఫీల్డ్ లోకి దిగారు.

కరోనా సునామీ నుంచి బయటపడేందుకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ఊహించని విధంగా విలయతాండవం చేస్తుంది. రోజుకి దేశంలో సుమారు నాలుగు లక్షల కేసులు నమోదవుతున్నాయి. దీంతో జనం వణికిపోతున్నారు. మరోవైపు చిత్ర పరిశ్రమలు అనాధికారికంగా బంద్‌ పాటిస్తున్నాయి. అదే సమయంలో కొందరు తారలు కరోనా బాధితులకు సహాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. సోనూ సూద్‌ ఈ విషయంలో ముందున్నారు. వీరితోపాటు చాలా మంది తారలు ప్రజలకు బెడ్స్, ఆక్సిజన్‌కి, హెల్ప్ లైన్‌ డిటెయిల్స్ పంచుకుంటూ సహాయపడే ప్రయత్నం చేస్తున్నారు. 

కానీ కన్నడ నటుడు అర్జున్‌ గౌడ ఏకంగా తానే ప్రత్యక్షంగా సహాయం చేసేందుకు ఫీల్డ్ లోకి దిగారు. అందుకోసం ఆయన అంబులెన్స్ డ్రైవర్‌గా మారారు. కోవిడ్‌ రోగులకు సహాయం అందించేందుకు ప్రత్యక్షంగా అంబులెన్స్ డ్రైవర్‌ అవతారం ఎత్తాడు. అంతేకాదు రోగులకు హెల్ప్ చేసేందుకు `ప్రాజెక్ట్ స్మైల్‌ ట్రస్ట్` పేరుతో అంబులెన్స్ సేవలను ప్రారంభించాడు. ఈ సందర్భంగా అర్జున్ గౌడ మాట్లాడుతూ, `తాను ప్రారంభించిన `ప్రాజెక్ట్ స్మైల్ ట్రస్ట్` అత్యవసర పరిస్థితుల్లో ఉన్న కోవిడ్‌ రోగులను హాస్పిటల్స్‌కు తరలించడం సహా కోవిడ్‌ కారణంగా చనిపోయినవారికి అంత్యక్రియలను సైతం నిర్వహిస్తుందని పేర్కొన్నాడు. ఇప్పటి వరకు తానే స్వయంగా ఆరుగురికి అంత్యక్రియలు జరిపించినట్టు తెలిపారు. వాళ్లు ఎక్కడి నుంచి వచ్చారు ఏ మతానికి చెందిన వారు అన్న దానితో సంబంధం లేకుండా అందరికీ సహాయం చేస్తున్నట్టు పేర్కొన్నారు.

ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉందని, దీంతో రానున్న రెండు నెలల వరకు ఈ ఆంబులెన్స్‌ సర్వీసులు కొనసాగించాలని యోచిస్తున్నట్లు వివరించాడు. తనకు వీలైనంత సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, కర్ణాటక ప్రజలకు సేవ చేయడం గౌవరంగా భావిస్తానని చెప్పాడు అర్జున్‌ గౌడ. ఆయన చేస్తున్న సేవలకు ఆయన ఫ్యాన్స్, నెటిజన్లు, కన్నడ ప్రజలు హర్షిస్తున్నారు. ఆయనపై సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. శివరాజ్‌ కుమార్‌ నటించిన `యువరత్న`, `రుస్తుమ్` వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అర్జున్‌గౌడ. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది
Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది