మా నాన్నకిచ్చిన మాట మీకిస్తున్నా.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్!

By Udayavani Dhuli  |  First Published Oct 2, 2018, 9:46 PM IST

యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అరవింద సమేత' సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడిన మాటలకు అభిమానులు సైతం ఎమోషనల్ అయ్యారు. 


యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అరవింద సమేత' సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడిన మాటలకు అభిమానులు సైతం ఎమోషనల్ అయ్యారు. 

''12 సంవత్సరాల నా కల త్రివిక్రమ్ గారితో సినిమా చేయాలని.. చాలా సార్లు అనుకున్నాం.. కానీ ఎప్పుడూ కుదరలేదు. 'నువ్వే నువ్వే' సినిమా తీయక ముందు నుండి నాకు చాలా దగ్గరైన మిత్రుడు.. ఎందుకు సినిమా కుదరడం లేదని చాలా సార్లు అనుకున్నాం.. అభిమానులు కూడా అనుకునేవారు. బహుసా.. నా జీవితంలో నెల క్రితం జరిగిన సంఘటన ఈ సినిమాకి చాలా ముడి పడుందేమో.. ఆయనతో సినిమా మొదలుపెట్టిన తరువాతే బహుసా .. నెల క్రితం జరిగిన సంఘటన తరువాతే బహుసా.. జీవితం యొక్క విలువ నాకు అర్ధమైంది..

Latest Videos

undefined

ఈ చిత్రం తాత్పర్యం ఒక్కటే.. 'ఆడిదైన రోజు ఎవడైనా గెలుస్తాడు.. కానీ యుద్ధం ఆపేవాడే మగాడు.. వాడే మొనగాడు'.. మనకి జీవితంలో తెలిసో.. తెలియకో.. చాలా మందితో బాధలు ఉంటాయి.. గొడవలు ఉంటాయి.. కానీ జీవితమంటే కొట్టుకోవడం.. తిట్టుకోవడం కాదు.. జీవితమంటే బతకడం.. ఎలా బతకాలో చెప్పే సినిమా 'అరవింద సమేత
వీర రాఘవ'. మనిషిగా పుట్టినందుకు ఎంత హుందాగా బతకాలో.. మనిషిగా పుట్టినందుకు ఎంత ఆనందంగా బతకాలో.. మనిషిగా పుట్టినందుకు మనిషిగా ఎలా బతకాలో చెప్పే సినిమా 'అరవిందం సమేత వీర రాఘవ'.

చాలా మంది ఈ టైటిల్ పెట్టినప్పుడు ఇదేంటి టైటిల్ పవర్ ఫుల్ లేదని అన్నారు.. ఒక మగాడి పక్క ఒక ఆడదాని కంటే బలం మరేదీ ఉండదు. ఒక గొప్ప చిత్రాన్ని  నాకు ఇవ్వడానికే, జీవితం విలువ తెలుసుకోవడానికి ఆ పరిపక్వత నాలో రావడానికే దేవుడు ఆగి నాతో ఈ సినిమా చేయించాడు. 12 ఏళ్ల ప్రయాణంలో ఒక దర్శకుడిని చూశాను.. ఒక స్నేహితుడ్ని చూశాను.. కానీ ఈ సినిమా పూర్తయ్యేలోపు ఒక ఆత్మబంధువుని చూశాను. నాకు ఎలాంటి కష్టాలు, దుఖాలు వచ్చినా మీ అందరితో పాటు నిలుచునేవాడే త్రివిక్రమ్. ఈ సినిమా నా జీవితంలో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది.

ఇది నా 28వ చిత్రం. 27 చిత్రాలలో తండ్రి చితికి నిప్పంటించే సన్నివేశాలు ఇప్పటివరకు ఏ దర్శకుడు పెట్టలేదు. అవి ఈ చిత్రంలోఉన్నాయి. ఎలా జరిగిందో తెలియదు కానీ జరిగింది. ఈ నెల రోజులు నాకొక తండ్రిగా, స్నేహితుడిగా తోడు ఉన్నాడు త్రివిక్రమ్. ఈ సినిమాకి తమన్ కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఎలా చేస్తాడనే ఊహ కూడా నాకు అందడం లేదు. ఒక సినిమా కోసం నిర్మాత ఎంత తాపత్రయ పడతారో విన్నాను.. కానీ ఈ సినిమాతో నిర్మాత చినబాబుని చూశాను. జగపతిబాబు లేకపోతే అరవింద సమేత వీర రాఘవ లేదు. అరవింద సమేతకి మరో స్ట్రాంగ్ పిల్లర్ నవీన్.

ఒక నెల రోజుల నుండి చాలా విషయాలు మనసులో పెట్టుకొని ఉన్నాను. ఎలా మాట్లాడాలో..? ఎలా చెప్పాలో..? తెలియడం లేదు. మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు. ఒక  తండ్రికి అంత అధ్బుతమైన కొడుకు ఉండడు.. ఒక కొడుకుకి అంత అధ్బుతమైన తండ్రి ఉండడు.. ఒక భార్యకి అంత అధ్బుతమైన భర్త ఉండడు.. ఒక మనవడికి అంత అధ్బుతమైన తాత ఉండడు. బ్రతికున్నంత వరకు ఎన్నో సార్లు మాకు చెప్పేవారు.. ఒక మహానుభావుడి కడుపున నేను పుట్టాను నా కడుపున మీరు పుట్టారు.. ఆరోజు నుండి మనల్ని మోస్తున్నది వీళ్లే(అభిమానులు). 

అభిమానులు జాగ్రత్త అని ఎన్ని సార్లు అన్నారో నాకు తెలుసు. ఈ సినిమా విడుదల చూడడానికి ఆయన ఉంటే బాగుండేది. మా నాన్నకిచ్చిన మాటే మీకిస్తున్నాను మా జీవితం మీకు అంకితం'' అని వెల్లడించారు.  

సంబంధిత వార్తలు.. 

జీవితంలో కూడా నిజమైన హీరో ఎన్టీఆర్.. త్రివిక్రమ్ కామెంట్స్!

కళ్యాణ్ రామ్ స్పీచ్ తో ఏడ్చేసిన ఎన్టీఆర్!

ఈ ఒక్క అడుగు వంద అడుగులతో సమానం.. 'అరవింద సమేత' ట్రైలర్ టాక్!

'అరవింద సమేత' ప్రీరిలీజ్: ఎన్టీఆర్ రాకతో అభిమానుల కేకలు

'అరవింద సమేత' ప్రీరిలీజ్ హడావిడి.. భారీ ఎత్తున తరలివచ్చిన అభిమానులు!

'అరవింద సమేత' ప్రీరిలీజ్ ఎలా ఉండబోతుందంటే!

'అరవింద సమేత' ప్రీరిలీజ్ ఈవెంట్.. బాలయ్య కనిపించడా..?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!

అరవింద సమేత.. అసలు కాన్సెప్ట్ ఇదేనట?

click me!