జయదేవ్ లేని లోటు నాకు తీరదు.. ఎమోషనల్ అయిన ఎన్టీఆర్!

Published : May 06, 2019, 10:21 AM IST
జయదేవ్ లేని లోటు నాకు తీరదు.. ఎమోషనల్ అయిన ఎన్టీఆర్!

సారాంశం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమాని, కృష్ణాజిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘం ప్రతినిధి జయదేవ్ మరణం పట్ల ఎన్టీఆర్ సానుభూతి వ్యక్తం చేశారు. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమాని, కృష్ణాజిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘం ప్రతినిధి జయదేవ్ మరణం పట్ల ఎన్టీఆర్ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను తీవ్ర మనోవేదనకు గురి చేసిందని, ఆయన లేని లోటు తీరదని అన్నారు.

ఈ మేరకు మీడియాకి ఓ లేఖ విడుదల చేశారు. అందులో.. ''నాకు అత్యంత ఆప్తుడు, కృష్ణ జిల్లా అభిమాన సంఘం ప్రతినిధి జయదేవ్ ఇక లేరు అన్న వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురి చేసింది. 'నిన్ను చూడాలని' చిత్రం తో మొదలయిన మా ప్రయాణం ఇలా అర్ధాంతరం గా ముగిసిపోతుంది అని ఊహించలేదు. నటుడిగా నేను చుసిన ఎత్తుపల్లాలలో నాకు వెన్నంటే ఉన్నది నా అభిమానులు. ఆ అభిమానులలో, నేను వేసిన తొలి అడుగు నుంచి నేటి వరకు నాకు తోడు గా ఉన్న వారి లో జయదేవ్  చాలా ముఖ్యమైన వారు. జయదేవ్ లేని లోటు నాకు తీరనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబానికి నా ప్రగాఢమైన సానుభూతి ని తెలుపుతున్నాను'' అని అభిమాని మృతిపట్ల విచారణ వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

1300 కోట్లతో బాక్సాఫీస్ క్వీన్ గా నిలిచిన హీరోయిన్ ఎవరు? 2025 లో టాప్ 5 స్టార్స్ కలెక్షన్లు
Demon Pavan Remuneration : 15 లక్షల జాక్ పాట్ తో పాటు, డిమాన్ పవన్ రెమ్యునరేషన్ టోటల్ గా ఎంతో తెలుసా?