భయంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లిన హీరోయిన్!

Published : May 06, 2019, 10:07 AM IST
భయంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లిన హీరోయిన్!

సారాంశం

బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ తెలుగులో 'ఆహా కళ్యాణం' సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.

బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ తెలుగులో 'ఆహా కళ్యాణం' సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ తనను రక్షించమని పోలీసులను ఆశ్రయించింది.

వివరాల్లోకి వెళితే.. ముంబైలో రాత్రివేళ వాణీకపూర్ తన కారులో వెళ్తుండగా.. ఓ యువకుడు ఆమెని గమనించి ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన వాణీ కపూర్ కారు డ్రైవర్ మరింత వేగంగా కారు నడిపాడు. అయినప్పటికీ ఆ యువకుడు మాత్రం కారుని అనుసరిస్తూనే వచ్చాడు. 

దీంతో కారు డ్రైవర్ నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు. అక్కడ వాణీకపూర్ ఆ యువకునిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో ఆ యువకుడి పేరు సమీర్ ఖాన్ అని తెలిసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివున్నాయి!

PREV
click me!

Recommended Stories

1300 కోట్లతో బాక్సాఫీస్ క్వీన్ గా నిలిచిన హీరోయిన్ ఎవరు? 2025 లో టాప్ 5 స్టార్స్ కలెక్షన్లు
Demon Pavan Remuneration : 15 లక్షల జాక్ పాట్ తో పాటు, డిమాన్ పవన్ రెమ్యునరేషన్ టోటల్ గా ఎంతో తెలుసా?