'జాలరి'కాదు.. క్లైమాక్స్ కు లింకున్న మరో టైటిల్!

By AN TeluguFirst Published May 6, 2019, 9:44 AM IST
Highlights

మెగా మేనల్లుడు, సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా సినిమా ఇంకా ప్రారంభమే కాలేదు. 

 మెగా మేనల్లుడు, సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా సినిమా ఇంకా ప్రారంభమే కాలేదు. కానీ రోజుకో వార్తతో  మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా టైటిల్ విషయంలో ఈ సినిమాపై ఆసక్తికరమైన డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాకు ‘జాలరి’ అనే టైటిల్ పెట్టనున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అవేమీ నిజం కాదని తేలిపోయింది.

తాజాగా మరో ఆసక్తికమైన  టైటిల్‌ తెర మీదకు వచ్చింది. గోదావిరి జిల్లా జాలర్ల జీవితాల నేపథ్యంలో ఎమోషనల్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘ఉప్పెన’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా చెప్తున్నారు. క్లైమాక్స్ లో సముద్రంలో ఉప్పెన వస్తుందని, అది లవ్ స్టోరికి ముడిపడి ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే  ఈ టైటిల్‌ను చిత్ర నిర్మాతలు రిజిస్టర్ చేయించారట. 

ఈ చిత్రానికి సంబంధించి వదిలిన  ప్రీ లుక్‌తోనే ఆకట్టుకుంది టీమ్. ఇప్పుడు చిత్రం టైటిల్ విషయంలోనూ అదే స్టైల్ లో ఆలోచిస్తోంది చిత్రయూనిట్. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ  చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. 

click me!