సమయం మించిపోతుంది మౌనంగా ఉంటే ఎలా రాజమౌళి..!

By Satish ReddyFirst Published Aug 29, 2020, 7:36 AM IST
Highlights

ఆర్ ఆర్ ఆర్ విషయంలో ఏస్ డైరెక్టర్ రాజమౌళికి ఆది నుండి అవాంతరాలే. షూటింగ్ మొదలుపెట్టిన నాటి నుండి వరుస అవరోధాలే. ఇక లాక్ డౌన్ ఆర్ ఆర్ ఆర్ పై మరింత ప్రతికూల ప్రభావం చూపగా, ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు తిరిగి ప్రారంభం అవుతుందో అర్థం కావడం లేదు.

దర్శకధీరుడు రాజమౌళి ఏ టైంలో ఆర్ ఆర్ ఆర్ ప్రకటించాడో కానీ మొదటి నుండి అవాంతరాలే. ఎదో ఒక కారణంగా షూటింగ్ వాయిదాపడుతూ వస్తుంది. ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న ఇద్దరు హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ గాయాలపాలు కావడంతో పాటు, ఇతర కారణాల చేత షూటింగ్ సవ్యంగా సాగలేదు. అందుకే ఆర్ ఆర్ ఆర్ విడుదల జులై 2020 నుండి జనవరి 2021కి మారింది. ఇక లాక్ డౌన్ పుణ్యమా అని ఆ డేట్ కూడా వెనక్కి పోయింది. 30శాతానికి పైగా షూటింగ్ జరుపుకోవాల్సిన ఉండగా అసలు 2021లో అయినా ఆర్ ఆర్ ఆర్ థియేటర్స్ లో దిగుతుండగా అనే అనుమానాలు మొదలయ్యాయి. 

లాక్ డౌన్ ముందు వరకు రాజమౌళి షూటింగ్ నిరవధికంగా నడిపారు. లాక్ డౌన్ తరువాత కూడా ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో భద్రతా చర్యల మధ్య షూటింగ్ జరపాలి అనుకున్నారు. దీనికోసం ఓ భారీ సెట్ కూడా వేయించారు. మొదట మాక్ షూట్ జరిపి తరువాత షూటింగ్ సాధ్యాసాధ్యాలపై నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. కరోనా విజృంభణతో పాటు పరిమిత సిబ్బందితో షూట్ చేయడం కష్టమే అని భావించి, కనీసం మాక్ షాట్ కూడా నిర్వహించలేదు. 

కాగా ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేయడంతో పాటు, షూటింగ్స్ కి అనుమతి ఇవ్వడం జరిగింది. దీనితో ఇతర పరిశ్రమలలో షూటింగ్స్ సందడి మొదలైంది. ఐతే రాజమౌళి సమయం మించిపోతున్నా దీనిపై ఎటువంటి ప్రకటన చేయడం లేదు. షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతాం అనే విషయంపై స్ఫష్టత ఇవ్వడం లేదు. ఇది కొంచెం ఎన్టీఆర్ అండ్ చరణ్ ఫ్యాన్స్ కి కొంచెం నిరాశకు గురిచేస్తుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్స్ త్వరగా మొదలుపెట్టాలని కోరుకుంటున్నారు. 
 

click me!